Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. బాలీవుడ్‌లో సగటు స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ప్రభాస్‌కు కూడా ఏర్పడింది. ఈయన నుంచి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులే కాదు.. హిందీ ప్రేక్షకులు కూడా ఎదరుచూస్తుంటారు. దర్శక నిర్మాతలు కూడా భారీ కథతోనే ప్రభాస్ దగ్గరకు వెళ్తున్నారు. బడ్జెట్ ఎంతైనా సరే పెట్టడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈయన పారితోషికం విషయంలో కూడా నిర్మాతలు వెనకడుగు వేయడం లేదు. చివరిగా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమా దాదాపు డిజాస్టర్ గా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ప్రభాస్ సినిమా రిజల్ట్ కారణంగానే విడుదల తర్వాత మళ్లీ మీడియా ముందుకు రాలేదు అని, ప్రత్యేకంగా మరొక దేశానికి వెళ్లిపోయినట్లు కొన్ని రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు అతని కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. అయితే దాని కోసం సర్జరీ చేయించుకోవాలని వైద్యులు అప్పుడే సూచించారట. రాధే శ్యామ్ సినిమా విడుదలకు సిద్హంగా ఉంది కాబట్టి ప్రమోషన్ కోసం ప్రభాస్ ఆ సర్జరీని కాస్త ఆలస్యం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఫైనల్ గా సినిమా విడుదల అవుతోంది అనగానే అప్పుడు ప్రభాస్ సర్జరీ కోసం స్పెయిన్ వెళ్లిపోయినట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ లిస్టులో అందరి ఫోకస్ ఎక్కువగా సలార్ సినిమా పైనే ఉండేది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బడా హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. మరోవైపు ఆది పురుష్ చిత్రం రామాయణం కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాబట్టి ఈ సినిమా ఎంతవరకు మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో చెప్పలేము ఇక ఆ తర్వాత ప్రాజెక్టు K , స్పిరిట్ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేసరికి మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. వరుస సినిమాలతో అలరించనున్న ప్రభాస్ ప్రస్తుతానికి గాయం నుండి త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.