Prabhas : బిగ్ షాకింగ్.. స‌లార్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్ర‌భాస్.. స‌ర్జ‌రీ త‌ప్ప‌దంటున్న వైద్యులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : బిగ్ షాకింగ్.. స‌లార్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్ర‌భాస్.. స‌ర్జ‌రీ త‌ప్ప‌దంటున్న వైద్యులు

Prabhas : బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. బాలీవుడ్‌లో స‌గ‌టు స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ప్ర‌భాస్‌కు కూడా ఏర్ప‌డింది. ఈయ‌న నుంచి సినిమా వ‌స్తుందంటే తెలుగు ప్రేక్షకులే కాదు.. హిందీ ప్రేక్షకులు కూడా ఎద‌రుచూస్తుంటారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా భారీ క‌థ‌తోనే ప్రభాస్ ద‌గ్గ‌ర‌కు వెళ్తున్నారు. బ‌డ్జెట్ ఎంతైనా స‌రే పెట్ట‌డానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈయన పారితోషికం విష‌యంలో కూడా నిర్మాత‌లు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :18 March 2022,7:30 pm

Prabhas : బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. బాలీవుడ్‌లో స‌గ‌టు స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ప్ర‌భాస్‌కు కూడా ఏర్ప‌డింది. ఈయ‌న నుంచి సినిమా వ‌స్తుందంటే తెలుగు ప్రేక్షకులే కాదు.. హిందీ ప్రేక్షకులు కూడా ఎద‌రుచూస్తుంటారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా భారీ క‌థ‌తోనే ప్రభాస్ ద‌గ్గ‌ర‌కు వెళ్తున్నారు. బ‌డ్జెట్ ఎంతైనా స‌రే పెట్ట‌డానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈయన పారితోషికం విష‌యంలో కూడా నిర్మాత‌లు వెన‌క‌డుగు వేయ‌డం లేదు. చివ‌రిగా ప్ర‌భాస్ రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని పల‌క‌రించాడు. ఈ సినిమా దాదాపు డిజాస్టర్ గా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ప్రభాస్ సినిమా రిజల్ట్ కారణంగానే విడుదల తర్వాత మళ్లీ మీడియా ముందుకు రాలేదు అని, ప్రత్యేకంగా మరొక దేశానికి వెళ్లిపోయినట్లు కొన్ని రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు అతని కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. అయితే దాని కోసం సర్జరీ చేయించుకోవాలని వైద్యులు అప్పుడే సూచించారట. రాధే శ్యామ్ సినిమా విడుదలకు సిద్హంగా ఉంది కాబట్టి ప్రమోషన్ కోసం ప్రభాస్ ఆ సర్జరీని కాస్త ఆలస్యం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఫైనల్ గా సినిమా విడుదల అవుతోంది అనగానే అప్పుడు ప్రభాస్ సర్జరీ కోసం స్పెయిన్ వెళ్లిపోయినట్లు సమాచారం.

prabhas gets injured in salaar shooting

prabhas gets injured in salaar shooting

Prabhas : గెట్ వెల్ సూన్..

ప్రస్తుతం ప్రభాస్ లిస్టులో అందరి ఫోకస్ ఎక్కువగా సలార్ సినిమా పైనే ఉండేది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స‌లార్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బడా హిట్ కొట్ట‌డం ఖాయం అంటున్నారు. మ‌రోవైపు ఆది పురుష్ చిత్రం రామాయణం కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాబట్టి ఈ సినిమా ఎంతవరకు మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో చెప్పలేము ఇక ఆ తర్వాత ప్రాజెక్టు K , స్పిరిట్ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేసరికి మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. వరుస సినిమాల‌తో అల‌రించ‌నున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతానికి గాయం నుండి త్వ‌ర‌గా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది