Krishnam Raju : కృష్ణం రాజు న‌టించిన సినిమాల‌లో ఆ పాటంటే ప్రభాస్‌కి చాలా ఇష్ట‌మ‌ట‌..!

Authored By Sam C | The Telugu News | Published on: September 11, 2022, 11:00 am

Krishnam Raju : న‌టుడు, నిర్మాత‌, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు కృష్ణం రాజు. వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు కృష్ణం రాజు. మొదటి సినిమా చిలకా గోరింక తర్వాత నేనంటే నేనే, భలే అబ్బాయిలు, బంగారు తల్లి, మనుషులు మారాలి, మళ్ళీ పెళ్ళి లాంటి సినిమాల్లో విలన్ పాత్రలు, కారెక్టర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసారు… కృష్ణంరాజు అనగానే ప్రేక్షకులు ప్రేక్షకులు గుర్తుపట్టేలా తన నటనతో మెప్పించారు. 1977లో కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘అమరదీపం’ కృష్ణంరాజు కేరీర్ లో బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, రాష్ట ప్రభుత్వం ఇచ్చే నందిఅవార్డునూ అందుకున్నారు.

కృష్ణ‌వేణి చిత్రం కృష్ణం రాజు కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. తెలుగుసినీ పరిశ్రమలో విలన్‌గా దూసుకువెళ్తున్న సమయంలో గోపీకృష్ణా మూపీస్‌ బ్యానర్‌ను స్థాపించిన కృష్ణంరాజు.. ఆ సంస్థలో కృష్ణవేణితో హీరోగా చేశారు. వాణిశ్రీ కథానాయికగా చేసిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం కృష్ణవేణి.. కృష్ణంరాజుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో 12 కేంద్రాల్లో కృష్ణవేణి శతదినోత్సవం జరుపుకుంది. న‌టుడిగానే కాదు, నిర్మాత‌గాను కృష్ణం రాజు ఎన్నో అద్భుత‌మైన సినిమాలు నిర్మించారు. అన్ని రకాల పాత్రలతో మెప్పించిన ఇయన రౌద్రంరసం పండించడంలో తనకుతనే సాటి అనిపించుకున్నారు.. కళ్ళల్లో నిప్పులు కురుపిస్తు తనదైన మాడ్యులేషన్ లో చెప్పే డైలాగ్స్ తో రెబల్ స్టార్ అనిపించుకున్నారు.

Prabhas likes that song in Krishnam Raju starrer movies

Prabhas likes that song in Krishnam Raju starrer movies

Krishnam Raju ; ఈ పాట మెచ్చిన ప్ర‌భాస్..

కృష్ణం రాజు వార‌సుడిగా సినీ పరిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ప్ర‌భాస్ ఆన‌తి కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అయితే ప్ర‌భాస్‌కి పెదనాన్న కృష్ణం రాజు నటించిన సినిమాల్లోని పాటల్లో ‘త్రిశూలం’ చిత్రంలోని ఒక పాట అంటే చాలా ఇష్టమట. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రిశూలం’ చిత్రంలోని ‘రాయిని ఆడది చేసిన రాముడివ’ పాట అంటే ప్రభాస్ కు చాలా ఇష్టం. ఈ విషయం కృష్ణంరాజు భార్య తెలిపారు. కే.వీ.మహదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఆత్రేయ లిరిక్స్ అందించారు. ఈ సినిమా అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp