Prabhas : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి. ఈ సినిమాపై ప్రతి ఒక్కరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఏకంగా రూ. 400 కోట్ల బడ్జెట్ తో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. లాంటి చాలా మంది స్టార్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాదు మరికొంతమంది గెస్ట్ అప్పీరెన్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కల్కి 2898AD సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలతో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందని అర్ధమైంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.
గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో ప్రభాస్ ఉపయోగించే కారు బుజ్జి అని చెప్పుకురాగా, బుజ్జిని తయారు చేయడానికి నాగ్ అశ్విన్ అండ్ టీం చివరికి ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజాలని కూడా కలిశారట. బుజ్జిని తయారు చేయడానికి టీం ఎంత కష్టపడ్డారో ఇటీవల మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. అప్పటి నుంచి బుజ్జిని చూడాలని.. ప్రభాస్ దానిని ఎలా డ్రైవ్ చేస్తాడో చూడాలి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం రోజు రామోజీ ఫిలిం సిటీలో దాదాపు నాలుగు కోట్ల ఖర్చుతో బుజ్జిని పరిచయం చేసే ఈవెంట్ నిర్వహించారు. అంతే కాదు బుజ్జి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్ బుజ్జిని డ్రైవ్ చేసుకుంటూ ఈవెంట్ కి ఎంట్రీ ఇచ్చాడు. బుజ్జితో గ్రౌండ్ మొత్తం రౌండ్లు కొట్టాడు. స్వయంగా ఒక సూపర్ హీరోలా ప్రభాస్ బుజ్జిని డ్రైవ్ చేస్తూ కనిపించాడు.
ప్రభాస్ బుజ్జితో కలసి చేస్తున్న విధ్వంసం మామూలుగా లేదు. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ ఘట్టాలు ఉన్నాయి. బుజ్జి ప్రభాస్ కి పరిస్థితులు అనుకూలంగా లేవు వెనక్కి వెళ్ళిపోదాం పద అని హెచ్చరిస్తుంది. ఇంక తిరిగి వెళ్ళేదే లేదు అంటూ ప్రభాస్ చెప్పడం ఆకట్టుకుంటోంది. ఒక్క వాహనం కోసం ఏకంగా రూ. 7 కోట్లు ఖర్చు పెట్టారంట. ఇక బుజ్జిని పరిచయం చేయడానికి ఏర్పాటు చేసిన ఈవెంట్ కోసం నాలుగు కోట్లు
ఖర్చు చేసారని టాక్ వినిపిస్తుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.