Prabhas marriage news
Prabhas Marriage : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ ఈశ్వర్ ‘ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్ తొలి సినిమాతో యావరేజ్ టాక్ ను సంపాదించుకున్న ఆ తర్వాత వచ్చిన ‘ వర్షం ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి స్టార్ డమ్ ను సంపాదించుకున్నారు. ఇక రాజమౌళి తో ‘ బాహుబలి ‘ సినిమా చేసి పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ ఫేమస్ అయ్యారు. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసేవన్ని పాన్ ఇండియా సినిమాలే. దీంతో పాన్ ఇండియా స్థాయిలో రెబల్ స్టార్ ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
అయితే ప్రభాస్ పుట్టినరోజు త్వరలోనే రానుంది. ఈనెల అంటే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ తల్లి ప్రభాస్ పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ , అనుష్క పెళ్లి చేసుకోవాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ప్రభాస్ అనుష్క లు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ప్రభాస్ అనుష్క కలిసి మిర్చి, బిల్లా, బాహుబలి సిరీస్ లలో నటించారు. చూడడానికి వీరిద్దరి జంట బాగుండడంతో అభిమానులు కూడా వీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నారు.
Prabhas marriage news
ఈ క్రమంలోనే వీరిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయినా ఈ వార్తలపై ప్రభాస్ అనుష్కలు ఖండించారు. మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని చెప్పారు. అయితే ప్రభాస్ పుట్టిన రోజు త్వరలోనే రానుంది. ఆ సందర్భంగా ప్రభాస్ తల్లి ఆయన పెళ్లి గురించి అనౌన్స్ చేయనుందని తెలుస్తుంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం అనుష్క నే పెళ్లి చేసుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు. మరి ప్రభాస్, అనుష్కలు ఏం చేస్తారో చూడాలి
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.