Prabhas : పెళ్లి వార్త చెబుతాడ‌నుకుంటే ఆ వార్త చెప్పి అందరిని బ‌క‌రాలు చేసిన ప్ర‌భాస్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Prabhas : పెళ్లి వార్త చెబుతాడ‌నుకుంటే ఆ వార్త చెప్పి అందరిని బ‌క‌రాలు చేసిన ప్ర‌భాస్

Prabhas : మే 17న ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టా స్టోరీ పోస్ట్‌గా త్వరలోనే మన జీవితంలోకి ఓ ప్రత్యేకమైన వాళ్లు వస్తున్నారు.. వెయిట్ చేయండి అని అన్నాడు. దీంతో ఇది అతని పెళ్లి గురించే అయి ఉంటుందని ఫుల్ ఖుష్ అయ్యారు. తీరా అది కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్ల కోసమే అని తర్వాత తేలింది. ఇప్పుడు బుజ్జి అంటూ ప్రభాసే ఆ పోస్ట్ పై ఓ క్లారిటీ ఇచ్చాడు. మే 18 సాయంత్రం 5 […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 May 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Prabhas : పెళ్లి వార్త చెబుతాడ‌నుకుంటే ఆ వార్త చెప్పి అందరిని బ‌క‌రాలు చేసిన ప్ర‌భాస్

Prabhas : మే 17న ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టా స్టోరీ పోస్ట్‌గా త్వరలోనే మన జీవితంలోకి ఓ ప్రత్యేకమైన వాళ్లు వస్తున్నారు.. వెయిట్ చేయండి అని అన్నాడు. దీంతో ఇది అతని పెళ్లి గురించే అయి ఉంటుందని ఫుల్ ఖుష్ అయ్యారు. తీరా అది కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్ల కోసమే అని తర్వాత తేలింది. ఇప్పుడు బుజ్జి అంటూ ప్రభాసే ఆ పోస్ట్ పై ఓ క్లారిటీ ఇచ్చాడు. మే 18 సాయంత్రం 5 గంటలకు స్క్రాచ్ ఎపిసోడ్ 04రిలీజ్ కానున్నట్లు వెల్లడించాడు. ఆ పోస్ట్ లోనే కింద.. “డార్లింగ్స్.. నా బుజ్జిని మీరు చూడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను” అని అతడు రాయడం విశేషం. కల్కి చిత్రీకరణకు నాగ్ అశ్విన్ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన‌ వాహ‌నాల‌ని చూపించ‌బోతున్నాడు.

Prabhas ట్విస్ట్ అదిరింది…

ఆ వస్తువులు ఎన్నడూ చూడని విధంగా ఉంటాయట. కల్కి మూవీలో వాడే వాహనాలకు టెక్నాలజీ విషయంలో సహాయం అందించాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను నాగ్ అశ్విన్ అడిగారు. అయితే కల్కి మూవీలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ కాగా, ఆయన ఓ ప్రత్యేక వాహనం వాడుతారట. దాని పేరు బుజ్జి కాగా… దాన్ని ప్రేక్షకులకులు పరిచయం చేయనున్నారట. ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు. మే 18 సాయంత్రం 5:00 గంటలకు భైరవకు చెందిన బుజ్జిని పరిచయం చేస్తామని యూనిట్ సభ్యులు తెలియజేశారు. కల్కి చిత్రంతో ప్రేక్షకులను నాగ్ అశ్విన్ ఫ్యూచర్ లోకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రంలో వాహనాలు కూడా భవిష్యత్ పరిస్థితులను అంచనా వేసి డిజైన్ చేసినట్లు సమాచారం.

Prabhas పెళ్లి వార్త చెబుతాడ‌నుకుంటే ఆ వార్త చెప్పి అందరిని బ‌క‌రాలు చేసిన ప్ర‌భాస్

Prabhas : పెళ్లి వార్త చెబుతాడ‌నుకుంటే ఆ వార్త చెప్పి అందరిని బ‌క‌రాలు చేసిన ప్ర‌భాస్

కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ మూవీ కోసం దేశవ్యాప్తంగా జోరుగా ప్రమోషన్లు నిర్వహించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలాంటి వాళ్లు నటిస్తున్నారు. అయితే ప్ర‌భాస్ పెళ్లి అంటూ అంద‌రు ఎన్నో ఆలోచ‌న‌లు చేయగా, అదంతా నిరాశే అయింది. చూస్తుంటే ప్ర‌భాస్ ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునేలా లేడుగా. 44 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ప్ర‌భాస్ బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ మాదిరిగా సింగిల్‌గా ఉండిపోతాడా ఏంటి అని నెటిజ‌న్స్ ముచ్చ‌టించుకుంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది