Prabhas : ప్ర‌భాస్‌కి భారీ హిట్ మిస్ అయ్యేలా చేసిన హ‌రికృష్ణ ఫోన్ కాల్‌..!

Authored By Sam C | The Telugu News | Published on: August 14, 2022, 10:00 pm

Prabhas : ప్ర‌స్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఆయ‌న సినిమాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్నాయి. త్వ‌ర‌లో ప్ర‌భాస్ అర‌డ‌జ‌నుకి పైగా సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. అయితే ప్ర‌భాస్‌కి ఓ సూప‌ర్ హిట్ సినిమా ఛాన్స్ రాగా, దానిని ఎన్టీఆర్ త‌న్నుకుపోయాడ‌ట‌. ఇది 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. ప్రభాస్ ని హీరోగా పరిచయం చేస్తూ అశ్వనీదత్ స్టూడెంట్ నెం 1 సినిమా నిర్మించాలని అనుకున్నాడు. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కి హీరో గా ఇది మొట్టమొదటి సూపర్ హిట్ అనే విష‌యం తెలిసిందే.. ఈ సినిమా ద్వారానే దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు..

Prabhas ; భ‌లే ప‌నైందిగా..

ప్ర‌భాస్ సినిమా ఛాన్స్ ఎన్టీఆర్‌కి రావ‌డం వెన‌క విష‌యాల‌ను ఇటీవ‌ల అశ్వినిద‌త్ చెప్పుకొచ్చాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా సమయం లో సీనియర్ హీరో కృష్ణంరాజు గారు ప్రభాస్ ని లాంచ్ చేసే క్రమం లో చాలా స్టోరీలే విన్నాడట..ఆ క్రమం లోనే అశ్వినీదత్ మరియు రాఘవేంద్ర రావు గారు రాజమౌళి గారిని కృష్ణం రాజు గారికి పరిచయం చేయించి స్టూడెంట్ నెంబర్ 1 కథని వినిపించాడట.. కృష్ణంరాజు గారికి కథ బాగా నచినప్పటికీ కూడా మొదటి సినిమా ఇంత క్లాస్ గా ఉంటె బాగోదు..ఇంకా ఎప్పుడైనా ఈ సినిమా చేద్దాం అని చెప్పాడట.

Prabhas missed the crazy project due to hari krishna

Prabhas missed the crazy project due to hari krishna

ఆ సమయంలో హరికృష్ణ అశ్వనీదత్ కు ఫోన్ చేసి ఎన్టీఆర్ తో సినిమా తీయమని కోరాడట. అన్న నందమూరి తారకరామారావు అన్నా అలాగే ఎన్టీఆర్ కుటుంబం అన్నా అశ్వనీదత్ కు ప్రాణం. దాంతో ఆయన మాట కాదనలేక ఎన్టీఆర్ తో సినిమా చేసాడు. అది సూపర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా ……స్టూడెంట్ నెం 1. ఎన్టీఆర్ కు ఈ సినిమా రాసి పెట్టి ఉండటంతో ప్రభాస్ సూపర్ హిట్ మిస్ అయ్యాడు. కట్ చేస్తే అదే ప్రభాస్ తో ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం నిర్మిస్తున్నాడు అశ్వనీదత్. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ – K చిత్రాన్ని నిర్మిస్తున్నాడు ఈ అగ్ర నిర్మాత. ఇక ఈ చిత్రానికి తన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp