Prabhas : నీకు కొంచెం అన్నా బుద్దుందా ప్ర‌భాస్.. చిన్న హీరోని సాకుగా చూపిస్తూ ప్ర‌భాస్‌పై ట్రోల్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : నీకు కొంచెం అన్నా బుద్దుందా ప్ర‌భాస్.. చిన్న హీరోని సాకుగా చూపిస్తూ ప్ర‌భాస్‌పై ట్రోల్స్

Prabhas : ప్రభాస్ ఓం రౌత్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ఆదిపురుష్‌. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ దాదాపు ఐదు వందల కోట్లు. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధిచిన టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా, దాంతో మూవీపై మంచి హైప్ వ‌స్తుంద‌ని అనుకున్నారు. కాని టీజర్ కొంప కొల్లేరు చేసింది. టీజర్‌ను చూసి ప్రతీ ఒక్కరూ విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌పై తిట్ల పురాణం కురిపించారు. రాముడు, రావణుడు, ఆంజనేయుడు, వానర సైన్యం ఇలా ఉంటుందా? అంటూ పాయింట్ పాయింట్‌ను తెగ‌ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :23 November 2022,3:40 pm

Prabhas : ప్రభాస్ ఓం రౌత్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ఆదిపురుష్‌. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ దాదాపు ఐదు వందల కోట్లు. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధిచిన టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా, దాంతో మూవీపై మంచి హైప్ వ‌స్తుంద‌ని అనుకున్నారు. కాని టీజర్ కొంప కొల్లేరు చేసింది. టీజర్‌ను చూసి ప్రతీ ఒక్కరూ విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌పై తిట్ల పురాణం కురిపించారు. రాముడు, రావణుడు, ఆంజనేయుడు, వానర సైన్యం ఇలా ఉంటుందా? అంటూ పాయింట్ పాయింట్‌ను తెగ‌ ట్రోల్స్ చేశారు. ఈదెబ్బతో ఓం రౌత్ మళ్లీ రిపేర్లు చేసేందుకు పూనుకోగా,

రిపేర్ల కోసం వంద కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాడట.టీజ‌ర్ రిలీజ్ అయిన స‌మ‌యంలో సినిమాకి సంబంధించి తెగ ట్రోలింగ్ జ‌ర‌గ‌గా, రాను రాను అది కాస్త స‌ద్దుమ‌ణిగింది. అయితే రీసెంంట్‌గా హ‌నుమాన్ టీజ‌ర్ విడుద‌ల‌య్యాక మ‌ళ్లీ సినిమాపై ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. హనుమాన్ టీజర్ చూశాక.. మన తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్కడున్నాడు.. ఏ స్థాయిలో విజువలైజ్ చేసుకున్నాడు..ఆ హిందీ డైరెక్టర్ ఏం ఆలోచించాడు.. ఏం తీశాడు అన్న దానిని ప‌ట్ట‌కొని ట్రోల్స్ చేస్తున్నారు. ప్ర‌భాస్ అస్స‌లు నీకు బుద్దుందా.. మ‌న ద‌గ్గ‌ర ఇలాంటి మంచి డైరెక్టర్స్ ఉంచుకొని పోయి పోయి హిందీ వాడితో సినిమా తీసి చేతులు

Prabhas on Trolls Adipurush

Prabhas on Trolls Adipurush

Prabhas : భ‌లే బుక్క‌య్యాడు..!

కాల్చుకుంటున్నావు అని తిట్టి పోస్తున్నారు. టీజ‌ర్‌లో హనుమాన్‌ను చూపించిన తీరు అదిరిపోయిందంతే. వాటర్ ఫాల్స్, విశ్వం, అంతరిక్షం ఇలా అన్నీ కూడా అద్భుతంగా చూపించారు. చివరి షాట్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి.. కథ ఏంటన్నది స్పష్టంగా చెప్పకపోయినా కూడా ఏదో కొత్తగా ట్రై చేసినట్టు క‌నిపిస్తోంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ అంటూ ఇలా పార్టులు తీస్తూనే ఉంటాడని చెప్పొచ్చు. అయితే హ‌నుమాన్ టీజ‌ర్ అంత అద్భుతంగా ఉండ‌గా, ఆదిపురుష్ అలా బెడిసి కొట్ట‌డంపై ప్ర‌స్తుతం చ‌ర్చ విప‌రీతంగా న‌డుస్తుంది

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది