Prabhas : చిన్న సినిమాని ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ ప్ర‌శంసించిన ప్ర‌భాస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : చిన్న సినిమాని ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ ప్ర‌శంసించిన ప్ర‌భాస్

Prabhas: ఆగ‌స్ట్‌లో విడుద‌లవుతున్న సినిమాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచిన విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించిన చిత్రం కార్తికేయ 2. యంగ్ హీరో నిఖిల్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ ఈ సినిమా తెరకెక్కించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో నిఖిల్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :17 August 2022,6:20 pm

Prabhas: ఆగ‌స్ట్‌లో విడుద‌లవుతున్న సినిమాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచిన విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించిన చిత్రం కార్తికేయ 2. యంగ్ హీరో నిఖిల్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ ఈ సినిమా తెరకెక్కించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చింది “కార్తికేయ‌ 2”.

ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు.. సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో చిత్రానికి సంబంధించి రీసెంట్‌గా సక్సెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమాను హిందీ లో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్ లలో రిలీజ్ చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయి ఈ రోజు 700 థియేటర్స్ లలో ఆడుతుంది. అంటే ఇప్పుడు సినిమా లాంగ్వేజ్ అనే బారికేడ్లను క్రాస్ అయ్యి ప్రజల గుండెల్లోకి వెళ్ళింది అంటే సినిమాలో సత్తా లేకపోతె అన్ని థియేటర్స్ లలో ఆడదు కదా.. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి అన్నారు

prabhas praise on karthikeya 2 movie

prabhas praise on karthikeya 2 movie

కార్తికేయ 2 సంచలన విజయం వైపుగా అడుగులు వేస్తున్న తరుణంలో హీరో నిఖిల్ పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకుంటారని కొందరు అంచనా వేస్తున్నారు. కాబట్టి నిఖిల్ కూడా పాన్ ఇండియా హీరోనే అంటున్నారు. నెక్స్ట్ నిఖిల్ ఓ భారీ స్పై థ్రిల్లర్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా ప్రకటించారు. కార్తికేయ 2 విజయం ఆ మూవీకి చాలా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. అయితే కార్తికేయ 2కి ఇంత భారీ రెస్పాన్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా ప్ర‌భాస్.. ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ కార్తికేయ సినిమాకి సంబంధించి ప్ర‌శంస‌లు కురిపించారు. ఇప్పుడు ఈ పోస్ట‌ర్ నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది