Radhe Shyam : ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన రాధేశ్యాం సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణమైన పరాజయం పాలయింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని అనిపించినా కూడా మిశ్రమ స్పందన దక్కడంతో వసూళ్ల విషయంలో డిజాస్టర్ గా మారింది. వీకెండ్ వరకు పర్వాలేదనిపించినా వీక్ డేస్ లో అత్యంత దారుణమైన నెంబర్స్ నమోదవుతున్నాయి. ఈ సమయంలో సినిమాకు సంబంధించి జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాకు మరింత నష్టం ను కలిగిస్తున్నాయి.దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఏదో ఒక సినిమా నుండి కాపీ కొట్టాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ కనీసం ఆలోచించకుండా కాస్త దృష్టి పెట్టకుండా ఈ సినిమా చేసేందుకు ఒప్పుకొని పెద్ద తప్పు చేశాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యూవీ క్రియేషన్ష్ వారు ఈ కాఫీ కథకు 300 కోట్ల బడ్జెట్ వారి విజ్ఞత అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ మొదలుకొని క్లైమాక్స్ లో వచ్చే షిప్ ఎపిసోడ్ వరకు ప్రతి ఒక్కటి కూడా కాఫీ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ ఒకసారి ట్రైన్లో ప్రయాణిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరి చేయి చూసి అందులో ఉన్న వారిలో చాలా మంది మరికాసేపట్లో చనిపోతున్నారు అని తెలుసుకుంటాడు. ఆ సన్నివేశం కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఒక తెలుగు సినిమాలో ఉంది. రైల్వే స్టేషన్లో ఒకతను రైలు లో ఉన్న వారి మొహాలు చూసి అంతా చనిపోతారని చెప్తాడు. దాంతో స్టేషన్ మాస్టర్ ను ఎంత బతిమిలాడినా కూడా రైలు ఆపేందుకు ఒప్పుకోరు. రైలు కొద్ది దూరం వెళ్లిన వెంటనే ప్రమాదం జరుగుతుంది.అప్పుడు స్టేషన్ మాస్టర్ వచ్చి రైలు ఆపమని అడిగిన వ్యక్తి కి దండం పెడతాడు.
ఇప్పుడు అదే సీన్ రాధేశ్యామ్ సినిమా లో కూడా పెట్టడం జరిగింది. ఇలా సినిమాలోని 99 శాతం సన్నివేశాలు కాపీ అంటూ నెటిజన్స్ సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక టైటానిక్ సన్నివేశం ను డైరెక్టుగా సినిమాలో దించేశారు. ఇలా ప్రతి సన్నివేశం కూడా ఏదో ఒక సినిమా నుండి సూపర్ హిట్ సినిమాలకు సంబంధించిన తీసుకోవడం జరిగింది. నాగార్జున నటించిన గీతాంజలి సినిమా నుండి ఇన్స్పిరేషన్ అయినట్లుగా చెప్పిన కొన్ని సన్నివేశాలు కూడా కాపీ అంటున్నారు. మొత్తానికి నాగార్జున మరియు ఇంకా ఎంతో మంది హీరోలు చేసిన సినిమాలకు సంబంధించిన సన్నివేశాలను ఈ సినిమాలో మరోసారి చూసే అవకాశం దక్కింది అనేది కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.