Prabhas : ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం వెనక్కు తగ్గిన ప్రభాస్‌.. ఆలస్యంగా రాధేశ్యామ్‌..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 31, 2021, 10:40 am

Prabhas  : ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధే శ్యామ్‌ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆర్‌ ఆర్‌ ఆర్‌ విడుదలైన వారం రోజులకే ఈ సినిమా రీలిజ్‌ అవుతుండటంతో ఈ రెండు సినిమాల కలెక్షన్లపై ఇది ప్రభావం చూపనుంది. అయితే ఇదే విషయమై.. రాధే శ్యామ్‌ చిత్ర బృందం ఆ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓ వైపు ఆర్ఆర్ఆర్ బృందం అన్ని భాషల్లోనూ విస్తృతంగా ప్రమోషన్లు చేస్తుంటే… రాధే శ్యామ్ చిత్ర బృందం మాత్రం అంతగా హాడవిడి చేయకపోవడమే అందుకు నిదర్శనంగా కనిపిస్తోందని అంటున్నారు.

Prabhas  : ఆర్‌ఆర్‌ఆర్‌ కోసమే ఆలస్యమా..?

అయితే సినిమా అనుకున్న సమయానికే వస్తుందని చిత్ర బృందం అంటోంది. కాగా ప్రమోషన్స్‌ ను కాస్త ఆలస్యంగా స్టార్ట్‌ చేయడానికి మరొక కారణం ఉందని తెలుస్తోంది. సినిమా విడుదలకు సరిగ్గా వారం ముందు అనగా.. జనవరి 7వ తారీకు నుండి రాధే శ్యామ్‌ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టబోతోందని సమాచారం. ఆర్‌ ఆర్‌ ఆర్‌ మాదిరి.. నార్త్ మొదలుకొని సౌత్ వరకు అన్ని ఇండస్ట్రీలను కవర్ చేయడానికి ప్రభాస్ రెడీ అయ్యాడట. ఆర్‌ ఆర్‌ ఆర్‌ కుడా భారీ బడ్జెట్ సినిమా కావడం, రాజమాళితో తనకు మంచి అనుబంధం ఉండటం కారణంగా..

radhe shyam movie postpone promostions because of rrr Movie

radhe shyam movie postpone promostions because of rrr Movie

ఇప్పపటినుంచే ప్రమోషన్స్ స్టార్ట్‌ చేస్తే… ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా బిజినెస్ కి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత .. యూరప్ బ్యాక్ డ్రాప్ లో పిరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్.. విక్రమాదిత్య అనే రోల్‌లో సందడి చేయబోతున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp