Prabhas : విజువల్ ట్రీట్.. ఇంట్రెస్టింగ్‌గా ప్రభాస్ ‘రాధే శ్యామ్’ టీజర్..

Authored By mallesh | The Telugu News | Published on: October 23, 2021, 4:05 pm

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘రాధే శ్యామ్’ మూవీ మేకర్స్ ఆ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే సినిమా విజువల్ ట్రీట్‌గా ఉండబోతున్నదని అర్థమవుతోంది.‘రాధే శ్యామ్’ టీజర్ ద్వారా విక్రమ్ ఆదిత్య పాత్రను పరిచయం చేశారు. టీజర్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా కనబడుతున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్న టీజర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మానవులు ఫ్యూచర్ చెప్పే పాత్రను ప్రభాస్ ఈ సినిమాలో పోషిస్తుండగా, 1975 బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ పీరియాడికల్ లవ్ స్టోరిలో ప్రభాస్‌కు జోడీగా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ‘ప్రేరణ’గా నటిస్తోంది.

Prabhas Radheshyam Movie Teaser

Prabhas Radheshyam Movie Teaser

టీజర్‌లో వీఏ లవ్స్ పీ అనే అక్షరాలు, గులాబీ పువ్వును చూపిన మేకర్స్.. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరి అని చెప్పేశారు. ఇక ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్టం రాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కాబోతుంది. ప్రభాస్ ఓన్ ప్రొడక్షన్ హౌజ్ గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ కోసం దాదాపు రూ.50 కోట్లు ఖర్చు పెట్టినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుంది.

Prabhas : భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం..

Prabhas Radheshyam Movie Teaser

Prabhas Radheshyam Movie Teaser

ఈ మూవీ హిందీ రైట్స్ మినహా మిగతా అన్ని లాంగ్వేజెస్ రైట్స్ జీ5 సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పలు భాషల్లో పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీతం అందించగా, తెలుగులో జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

mallesh

No bio available for this author.

  1. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  2. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  3. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  4. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  5. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  6. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  7. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp