Prabhas : ఆమె ప్రేమ కోసం ఎదురుచూస్తున్న .. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిన ప్రభాస్ కామెంట్స్ ..!
ప్రధానాంశాలు:
Prabhas : ఆమె ప్రేమ కోసం ఎదురుచూస్తున్న .. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిన ప్రభాస్ కామెంట్స్ ..!
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కారణం ఆయన కొత్త సినిమా కాదు ఆయన వ్యక్తిగత జీవితం. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో, వయసు 46 దాటినా ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కొనసాగుతున్నారు. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా పెళ్లి, ప్రేమ ప్రశ్నలే ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్ర బృందంతో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలో నటించిన ఒక హీరోయిన్ ఆయనను ప్రేమపై అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మొదట నవ్వుతూ స్పందించిన ప్రభాస్ ఇది చాలా పర్సనల్ ప్రశ్న అని చెప్పినా చివరికి తన మనసులోని మాట బయటపెట్టారు. “నిజంగా నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది. అది ఎంత అద్భుతమైన అనుభవమో తెలుసుకోవాలని ఉంది. ఆ క్షణం కోసం నేను ఎదురుచూస్తున్నాను” అని చెప్పడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.
Prabhas : ఆమె ప్రేమ కోసం ఎదురుచూస్తున్న .. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిన ప్రభాస్ కామెంట్స్ ..!
Prabhas : సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్స్
ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ విషయంపై చర్చలు మొదలుపెట్టారు. “ప్రభాస్ లవ్ స్టోరీ ఎప్పుడు మొదలవుతుందా?” అనే ఆసక్తి మరింత పెరిగింది. కొందరు అభిమానులు అయితే ఆ లక్కీ గర్ల్ ఎవరో ఊహించడంలోనే బిజీ అయ్యారు. మరికొందరు అయితే ప్రభాస్‌కు సరైన జోడీగా అనుష్క శెట్టి పేరును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. గతంలో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై ఎన్నో రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ప్రభాస్ ప్రేమ గురించి ఓపెన్ కావడంతో పాత చర్చలు మళ్లీ వేడెక్కాయి. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ప్రభాస్ సింప్లిసిటీ, లైఫ్ స్టైల్ గురించి ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఆయనతో పని చేయడం ఒక ప్రత్యేక అనుభవమని పలువురు చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Prabhas : వరుస భారీ ప్రాజెక్టులతో సూపర్ ఫామ్
వ్యక్తిగత జీవితంపై చర్చలు జరుగుతున్నప్పటికీ, కెరీర్ పరంగా ప్రభాస్ మాత్రం టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ముందుగా భారీ అంచనాల మధ్య ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి 2’ వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ‘సలార్ 2’పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ప్రభాస్ సినిమా వస్తుందంటే టాలీవుడ్ సర్కిల్స్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. ఆయనకు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ప్రతి ప్రాజెక్ట్‌కి ప్రత్యేకమైన క్రేజ్ తీసుకువస్తోంది. ప్రేమ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పిన ప్రభాస్ మాటలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఆయన ప్రేమ కథ ఎప్పుడు మొదలవుతుందో, ఆ అదృష్టవంతురాలు ఎవరో అన్నదే ఇప్పుడు అందరి ఆసక్తి. అప్పటివరకు మాత్రం ప్రభాస్ సినిమాలతోనే అభిమానులను అలరిస్తూనే ఉంటారు.