Prabhas : మహేష్ బాబు కోసం ఎవ్వరూ చెయ్యలేని పని చేసిన ప్రభాస్.. నిజంగా గొప్ప విషయం ఇది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : మహేష్ బాబు కోసం ఎవ్వరూ చెయ్యలేని పని చేసిన ప్రభాస్.. నిజంగా గొప్ప విషయం ఇది !

 Authored By sekhar | The Telugu News | Updated on :15 June 2023,8:00 pm

Prabhas : బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ఓ వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే మహేష్ బాబు సజెషన్ చేసిన డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మేటర్ లోకి వెళ్తే మహేష్ బాబు చేయాల్సిన సినిమాని ప్రభాస్ చేతికి వెళ్ళటం జరిగిందట. అది కూడా పాన్ ఇండియా నేపథ్యం కలిగిన సినిమా కావటంతో ప్రభాస్ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చేసేసారట. విషయంలోకి వెళ్తే ప్రభాస్ నటించిన “ఆదిపురుష్”..రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కించటం జరిగింది. జూన్ 16వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరికొన్ని ప్రాజెక్టులు ప్రస్తుతం చేస్తున్నారు. త్వరలోనే సందీప్ రెడ్డి దర్శకత్వంలో “స్పిరిట్” అనే సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ మొదట మహేష్ బాబుకి సందీప్ రెడ్డి వినిపించడం జరిగిందట. అయితే ఇది తనకి సూట్ కాదని ప్రభాస్ బాడీ లాంగ్వేజ్.. మరియు పాన్ ఇండియా సబ్జెక్టు కావటంతో అతని మార్కెట్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందని సందీప్ రెడ్డి తో పాటు ప్రభాస్ కి ఫోన్ చేసి ప్రత్యేకంగా స్టోరీ వినాలని.. మహేష్ చెప్పటంతో ప్రభాస్ విని ఫస్ట్ సీట్టింగ్ లోనే ఈ సినిమాని ఓకే చేయడం జరిగినట్టు సరికొత్త వార్త వైరల్ అవుతుంది. ప్రధానంగా సినిమాలో బోల్డ్ డైలాగ్స్ ఇంకా రొమాంటిక్ సీన్స్ యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో మహేష్ “స్పిరిట్” ప్రాజెక్టును వదులుకోవడం జరిగిందంట.

prabhas really a great thing For Mahesh Babu

prabhas really a great thing For Mahesh Babu

ఆ రీతిగా మహేష్ చేయాల్సిన “స్పిరిట్” ప్రాజెక్టు ప్రభాస్ చేతికి చిక్కినట్లు సరికొత్త వార్త వైరల్ అవుతుంది. ఒక విధంగా మహేష్ చెప్పడంతోనే ప్రభాస్ కూడా ఈ సినిమాకి కమిట్ అయినట్లు టాక్. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో మహేష్ కోసం ఎవరు చేయలేని పని ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ ఉన్నాగాని సినిమా ఓకే చేయటం నిజంగా గొప్ప విషయమని అభిమానులు అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది