Prabhas Salaar : బిగ్ బ్రేకింగ్ : లీక్ అయిన ప్రభాస్ సలార్ సినిమా ఇంటర్వెల్ బ్లాక్?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: May 17, 2023, 3:05 pm

Prabhas Salaar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు.. ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ సలార్ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సినిమాలు ఏవీ ఆడలేదు. అట్లర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం తన చేతుల్లో ఉన్న సినిమాల మీదనే ప్రభాస్ ఆశలు పెట్టుకున్నారు. హై ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. త్వరలో రాబోయే ఆది పురుష్ సినిమా, సలార్ సినిమాల మీదనే ప్రభాస్ ఆశలు పెట్టుకున్నారు.

అయితే.. సలార్ సినిమా ప్రభాస్ కు చాలా స్పెషల్. ఎందుకంటే ఆ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరో కాదు.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ దానికి ప్రభాస్ హీరో కావడంతో ఇక ఆ సినిమా గురించి ఓ రేంజ్ లో క్రేజ్ వస్తోంది.అయితే.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో విడుదల కాబోతోంది.

prabhas-salaar-movie-interval-scene-leaked

prabhas-salaar-movie-interval-scene-leaked

Prabhas Salaar : దసరా కానుకగా విడుదల కానున్న సలార్

ఈ దసరా కానుకగా సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నా.. ఈ సినిమా ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదు అంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ రోమాలు నిక్కపోడుచుకునేలా చేస్తోంది. అది ఇంటర్వెల్ సీన్. నిజానికి ప్రభాస్ అన్ని సినిమాల్లో ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుంది. ఛత్రపతి సినిమా నుంచి బాహుబలి సినిమాల వరకు ఇంటర్వెల్ సీన్స్ అదిరిపోతాయి. సలార్ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా అదిరిపోతుందట. ఇప్పటి వరకు ఏ సినిమాలో లేని ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇందులో ఉంటుందట. ఇంటర్వెల్ సీన్ చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం అంటున్నారు. ఇక.. బాహుబలిని మించి ఈ సినిమా ఉండబోతుందట. చూద్దాం మరి సలార్ సినిమా ఏం రేంజ్ లో ఉంటుందో?

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp