Home » Entertainment » Prabhas Salaar Movie Update 2
Entertainment

prabhas : ఆదిపురుష్ ఫ్లాప్ అయ్యింది అనే బాధ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒళ్ళు ఝాలధరించే సూపర్ గుడ్ న్యూస్ !

Authored By
aruna
The Telugu News | Updated on: June 18, 2023 1:50 pm
Advertisement

prabhas : యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో సందడి చేస్తున్నాడు. ఇక త్వరలోనే ‘ సలార్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది కూడా అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తుంది. అయితే తాజాగా సలార్ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా టీజర్ గురించి చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ సినిమా యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ సినిమా టీజర్ ను జూలై నెలలో విడుదల చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలనుంచి సమాచారం వస్తుంది.

Advertisement

అంతేకాకుండా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ చేయాలని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. ఇంకా మూడు నెలల సమయం ఉండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే జూన్, ఆగస్టు నెలలో టీజర్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఆదిపురుష్ సినిమాను ఎంజాయ్ చేస్తున్న అభిమానులకి సలార్ సినిమా అప్డేట్ రావడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు. హలో సినిమా కూడా ప్రేక్షకులలో పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ కొంతమంది నెగిటివ్ గా చెప్పిన ఎక్కువగా అయితే పాజిటివ్ గానే వినిపిస్తుంది.

prabhas salaar movie update

Advertisement

ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్ జోనర్ లో రాబోతుంది. అలాగే ఈ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతుందని తెలుస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం భారీగా ప్లాన్ చేశాడని సమాచారం. ఇక ప్రభాస్ సలార్ సినిమాతో పాటు మరోవైపు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభాస్ బిజీబిజీగా అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ అభిమానులను సర్ప్రైస్ ఇస్తున్నాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి