Prabhas : బ్రేకింగ్… లీక్ అయిన ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగాల స్పిరిట్ స్టోరీ .. ఈ మాత్రం ఉంటే బ్లాక్ బస్టర్ అంటోన్న ఫ్యాన్స్..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: February 18, 2023, 4:00 pm

Prabhas  ; రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క ‘ బాహుబలి ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. అంతకుముందు కేవలం టాలీవుడ్ లోనే సినిమాలు చేసిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ 4 ప్రాజెక్టులలో బిజీగా ఉన్నాడు. ‘ ఆదిపురుష్ ‘ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. జూన్ నెలలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. విడుదలైన ఈ సినిమా టీజర్ నిరాశ పరచడంతో బెటర్మెంట్ కోసం ట్రై చేస్తున్నారట. ఈ సినిమాతో పాటు ప్రభాస్ అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగల డైరెక్షన్లో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.

Prabhas spirit movie update

Prabhas spirit movie update

అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. సందీప్ రెడ్డి ప్రస్తుతం యానిమల్ సినిమా చేస్తున్నారు. దీంతో స్పిరిట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సమయం పడుతుంది. అయితే స్పిరిట్ నీ ఉద్దేశిస్తూ సందీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా స్పిరిట్ సినిమా ఉంటుందన్నారు. యానిమల్ మూవీ తర్వాత నేను చేసే సినిమా స్పిరిట్ అని అన్నారు. దీంతో సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Prabhas spirit movie update

Prabhas spirit movie update

ఇకపోతే ప్రభాస్ ఈ రెండు సినిమాలతో పాటు కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘ సలార్ ‘ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. జగపతిబాబు, పృధ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే నాగ అశ్విన్ డైరెక్షన్లో ‘ ప్రాజెక్ట్ కే ‘ సినిమా రూపొందుతుంది. ప్రభాస్ కెరీర్ లోని భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశాపటాని లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Chandrababu : స్థానిక పోరులో సీట్లు వారికే.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌తో పార్టీ నేతలకు దిమ్మతిరిగే క్లారిటీ..!"

  2. "Devineni Mahitha : విజయవాడ మేయర్ బరిలో దేవినేని మహిత? టీడీపీలో హాట్ టాపిక్"

  3. "Janasena : విజయవాడ మేయర్ పీఠంపై జనసేన కన్ను.. వంగవీటి పుష్పాంజలి పేరుతో బిగ్ ట్విస్ట్..?"

  4. "LPG Gas Connection : కొత్త LPG గ్యాస్ కనెక్షన్లు ఎందుకు ఆగిపోయాయి? అసలు కారణం ఇదేనా..?"

  5. "Snigdha : నేను లెస్బియన్ కాదు.. నచ్చితే అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటా”.. నటి స్నిగ్ధ క్లారిటీ"

  6. "Daily Walking : మీ వయసుకు తగ్గట్టు రోజూ ఎన్ని అడుగులు నడవాలి? వాకింగ్ లెక్కలు ఇవే!"

  7. "Onion Garlic During Fasting : ఉపవాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు? దీని వెనుక ఉన్న పురాణ కథ ఇదే"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp