Home » Entertainment » Prabhas Went To Underground For That Reason
Entertainment

Prabhas : ఎవరికీ కనబడకుండా పోయిన ప్రభాస్.. ఎందుకో తెలుసా?

Authored By
mallesh
The Telugu News | Published on: January 15, 2022, 8:00 pm
Advertisement

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్, సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆయన నటించిన ‘రాధే శ్యామ్’ ఈ నెల 14న విడుదల కావాల్సి ఉంది. కానీ, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. దాంతో ప్రభాస్ అభిమానులు నిరాశ చెందారు. ఈ సంగతులు అలా ఉంచితే.. ప్రభాస్ మాత్రం ఎవరికీ కనబడకుండా పోయారన్న వార్త ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ప్రభాస్ ఎందుకలా చేశారంటే..టాలీవుడ్ స్టార్ హీరోలందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా హ్యాపీగా తమ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. సొంతూళ్లకు వెళ్తున్నారు. ఫ్యాన్స్‌ను కలుస్తున్నారు.

Advertisement

సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటున్నారు. అయితే, ప్రభాస్ మాత్రం ఎక్కడా కనబడటం లేదు. కాగా, ప్రభాస్ ప్రజెంట్ స్క్రిప్ట్స్ వినే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడని టాక్. కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న అన్ని సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రజెంట్ కొత్త సినిమాల స్టోరిలను వింటున్నారని వినికిడి. అలా హాయిగా అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయి మరీ ప్రభాస్ వర్చువల్‌గా స్టోరిలను వింటున్నారని సమాచారం.ప్రభాస్ ప్రజెంట్ బాలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేయాలని అనుకుంటున్నారట.

prabhas went to underground for that reason

Advertisement

Prabhas : ఫ్యాన్స్‌ను పలకరించని ప్రభాస్..!

అందులో భాగంగానే బాలీవుడ్ డైరెక్టర్స్ చెప్పే స్టోరిలను వింటున్నారని సినీ సర్కిల్స్‌లో టాక్. ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ ఫిల్మ్ రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేసే చాన్సెస్ ఉన్నాయి. ఆ సంగతి పక్కనబెడితే.. ప్రభాస్ ప్యారలల్‌గా ‘సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కె’ ఫిల్మ్స్‌ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ‘అర్జున్ రెడ్డి, కబీర్ ఖాన్, యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ప్రభాస్ తన 25వ పిక్చర్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి