317 GO : తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన 317 జీవోను ఉద్యోగులు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఈ జీవో విషయమై ఉద్యోగులు ప్రతీ రోజు ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతూనే ఉన్నారు. కాగా, ఈ సారి ఉద్యోగుల పిల్లలు తాము 317 జీవో వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేసీఆర్ ను ప్రశ్నించారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుతో వినూత్న నిరసన తెలిపారు.సంక్రాంతి సందర్భంగా అందరూ ఇళ్ల ఎదుట ముగ్గులు వేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ముగ్గు ద్వారా కూడా నిరసన తెలపాలనే ఉద్దేశంతో ముగ్గు వేశారు. సదరు ముగ్గులో ఆదిలాబాద్ కు చెందిన చిన్నారులు తమ ప్రశ్నలు కూడా సంధించారు. తమ తల్లికి ఒక జిల్లా, తండ్రికి మరో జిల్లా కేటాయించడంతో తమ పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా వారు వినూత్న రీతిలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని చిన్నారులు ముగ్గులో రాశారు.తాము ఏ జిల్లాకు వెళ్లాలి అని కేసీఆర్‌ను తాత అని సంబోధిస్తూ అడిగారు. ఈ క్రమంలోనే తమ తల్లిదండ్రులను తమ నుంచి విడదీయొద్దని, తమ వద్దే ఉంచాలని కోరారు.
ముగ్గులో వారి హ్యాపీ పొంగల్ అని ఇంగ్లిష్ అక్షరాలతో రాసిన క్రమంలో ఎడమ వైపున ‘అమ్మ ఒక జిల్లా.. నాన్న ఒక జిల్లా.. నేను ఏ జిల్లా… కేసీఆర్ తాతా? ’ అని రాశారు. మరో వైపున జీవో నెం.317 స్పౌజ్ బాధితులు ఆదిలాబాద్ అని పేర్కొన్నారు. ఇక ఈ ముగ్గు ముందర ఇద్దరు అమ్మాయిలు చేతులు జోడించి మరి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. మొత్తంగా ఉద్యోగులే కాదు ఉద్యోగుల పిల్లలు కూడా వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఈ సంగతి ఈ చిన్నారులు చేసిన పని ద్వారా స్పష్టమవుతున్నది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.