Namitha Dance : బొద్దుగా ఉన్నా తగ్గేదెలే.. తన డ్యాన్స్‌తో కుమ్మేస్తోన్న ప్రభాస్ హీరోయిన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Namitha Dance : బొద్దుగా ఉన్నా తగ్గేదెలే.. తన డ్యాన్స్‌తో కుమ్మేస్తోన్న ప్రభాస్ హీరోయిన్

 Authored By mallesh | The Telugu News | Updated on :12 September 2022,3:30 pm

Namitha dance : హీరోయిన్ నమిత.. ఈ పేరు వినగానే చాలా మందికి జెమిని సినిమా గుర్తొస్తుంది. అందులో నమిత మార్వాడి లాంగ్వేజ్ మాట్లాడుతూ చాలా క్యూట్‌గా కనిపిస్తుంటుంది. విక్టరీ వెంకటేశ్‌కు జోడిగా కనిపించిన నమిత ఆతర్వాత కొంతకాలం ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. ఆ సినిమా ఫెయిల్యూర్ కావడం వల్లే నమితకు చాన్సులు రాక వేరే ఇండస్ట్రీకి వెళ్లిపోయిందని అప్పట్లో టాక్ వచ్చింది.కానీ కొంతకాలం తర్వాత ప్రభాస్ సరసన బిల్లా మూవీలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించిన నమిత చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేసింది. హీరోయిన్ కావాలనే ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చింది. నమిత తొలుత గుజరాత్ సినిమాలు చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా టాలీవుడ్, కోలివడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా నమిత పలు సినిమాలు చేసినట్టు తెలుస్తోంది. సినిమాల్లోకి రాకముందు ఈ బొద్దుగుమ్మ అందాల పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసింది.

prabhas who is chubby but cant lose weight with his dancing is a heroine

prabhas-who-is-chubby-but-cant-lose-weight-with-his-dancing-is-a-heroine

1998వ సంవత్సరంలో కేవలం 17ఏళ్ల వయస్సులో మిస్ సూరత్ కిరీటం గెలుచుకున్న నమిత.. 2001మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత ముంబైకు మకాం మార్చిన ఈ బ్యూటీ హిమానీ క్రీమ్, హ్యాండ్ సోప్, అరుణ్ ఐస్ క్రీమ్స్, మాణిక్‌చంద్ గుట్కా, నైల్ హెర్బల్ షాంపూ వంటి అనేక ఉత్పత్తులను ప్రమోటర్‌గా చేసింది.

Namitha dance : నమితలో ఇంత మార్పు వచ్చిందా..

ఇక తెలుగులో సొంతం సినిమాలో నటించి మంచి విజయాన్ని కైవసం చేసుకున్న నమిత.. ఆ తర్వాత బిల్లా మూవీలో నటించింది.కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా కూడా చేసింది. ఉన్నట్టుండి బరువు పెరిగిన కారణంగా ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయానని టాక్. తాజాగా నమితకు సంబంధించి ఓ డ్యాన్సింగ్ వీడియో వైరల్ అవుతోంది. తెలుగు యాక్టర్ నందుతో కలిసి ఆమె అద్భుతంగా స్టెప్పులు వేస్తోంది. ఇందులో కాస్త స్లిమ్‌గా కనిపించిన నమిత.. చెమటలు కక్కుతూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తోంది.

YouTube video

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది