prabhs guest for kgf 2 Movie
Prabhas : యష్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం కేజీఎఫ్.. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తుంది. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీనికి సీక్వెల్‌ను తీయాలని చిత్ర యూనిట్ అప్పుడే డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగానే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ పేరిట దీన్ని మొదలు పెట్టేశారు. మొదటి భాగంలో కేజీఎఫ్ మొత్తాన్ని తన వశం చేసుకున్న రాఖీ భాయ్‌కు అధీరా రూపంలో ప్రధాన ప్రత్యర్థి రావడంతో ఈ కథ ప్రారంభం అవుతుంది. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి పోరాటం జరిగింది అనే నేపథ్యంతో దీన్ని రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి చాలా రోజులు కాగా, ఏప్రిల్ 14న చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ కేజీఎఫ్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని ఏకంగా రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తుండగా, ఈ క్రమంలోనే ఆయనని కేజీఎఫ్ 2 ఈవెంట్‌కి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ రావలసి ఉంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దుమ్ముదులిపిన కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా ఈ కేజీఎఫ్-2 రూపొందుతోంది.
prabhs guest for kgf 2 Movie
భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో మరోసారి బాక్సాఫీస్ దాడి చేయబోతున్నాడు హీరో యష్. ఎంతో ప్రతిష్టాత్మకంగా హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ బాణీలు కట్టిన ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాపై అన్ని వర్గాల ఆడియన్స్‌లో ఓ రేంజ్ అంచనాలున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.