Prakash Raj Spirit Movie : ‘స్పిరిట్’పై పుకార్లకు ప్రకాష్ రాజ్ చెక్… నా షూటింగ్ ఇంకా మొదలే కాలేదు అంటూ పంచ్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: February 9, 2026, 8:20 pm
  •  Prakash Raj Spirit Movie : ‘స్పిరిట్’పై పుకార్లకు ప్రకాష్ రాజ్ చెక్… నా షూటింగ్ ఇంకా మొదలే కాలేదు అంటూ పంచ్..!

Prakash Raj Spirit Movie :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’  Spirit Movie పై ఇటీవల సోషల్ మీడియాలో వినిపించిన వార్తలకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో విభేదాలు వచ్చాయని, అందుకే ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారనే ప్రచారం జోరుగా సాగింది.ఈ పుకార్లపై ప్రకాష్ రాజ్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఘాటుగా స్పందించారు.

Prakash Raj Spirit Movie : ‘స్పిరిట్’పై పుకార్లకు ప్రకాష్ రాజ్ చెక్… నా షూటింగ్ ఇంకా మొదలే కాలేదు అంటూ పంచ్..!

Prakash Raj Spirit Movie : ‘స్పిరిట్’పై పుకార్లకు ప్రకాష్ రాజ్ చెక్… నా షూటింగ్ ఇంకా మొదలే కాలేదు అంటూ పంచ్..!

Prakash Raj Spirit Movie : పంచ్ అదిరింది…

విషపూరితమైన ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారికి ఒక విషయం చెప్పాలి. ‘స్పిరిట్’ సినిమాలో నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. అప్పుడే మీ వాట్సాప్ ఫ్యాక్టరీల్లో కథలు అల్లేస్తున్నారా? కాస్త ఎదగండి… మీ పనులు మీరు చూసుకోండి” అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆయన స్పందనతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు పూర్తిగా తెరపడింది.ఈ స్పష్టతతో ప్రకాష్ రాజ్ ‘స్పిరిట్’ సినిమాలో కొనసాగుతున్నారనే విషయం ఖరారైంది. ఆయన పాత్రపై అధికారిక సమాచారం బయటకు రాకపోయినా, ప్రభాస్ తండ్రి పాత్రలో లేదా ఒక ప్రభావవంతమైన పోలీస్ అధికారిగా కనిపించే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సందీప్ రెడ్డి వంగా స్టైల్‌కు తగ్గట్టుగా ఈ చిత్రం భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోందని సమాచారం. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఈ చిత్రం మార్చి 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  2. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  3. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  4. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  5. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  6. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  7. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp