Home » Entertainment » Prakash Raj Sensational Decision
Entertainment

Prakash Raj : ప్రకాశ్‌రాజ్ సంచలన నిర్ణయం.. ‘మా’కు పోటీగా మరో అసోసియేషన్?

Authored By
praveen T
The Telugu News | Published on: October 12, 2021, 5:09 pm
Advertisement

Prakash Raj : ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్‌(మా)లో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ మంచు విష్ణు చేతిలో ఓడిపోయిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ప్రకాశ్‌రాజ్ మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ‘మా’కు పోటీగా మరో అసోసియేషన్‌ను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

prakash raj sensational decision

మరి కొంత మంది సభ్యులతో కలిసి ప్రకాశ్ రాజ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయాలన్నిటినీ వివరిస్తారని వినికిడి. ఇకపోతే మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయినప్పటికీ కొంత మంది ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన వారు ఇంకొందరు ఆర్టిస్టులు ‘మా’కు రాజీనామా చేస్తే పరిస్థితులు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement

మెగా బ్రదర్ నాగబాబు ‘మా’ ఎలక్షన్స్ తర్వాత మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే నాగబాబు ప్రాంతీయవాదం, సంకుచిత ధోరణి ఉందనే కామెంట్స్ చేయగా, అవి చర్చనీయాంశమవుతున్నాయి.

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి