Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్ !

Authored By Breaking News | The Telugu News | Published on: June 5, 2023, 4:00 pm

Jr NTR : “కేజిఎఫ్” తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ నీ చెడుగుడు ఆడేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇండియాలో అతి చిన్న కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ సినిమా దేశంలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. “కేజిఎఫ్” రెండు భాగాలు రికార్డు స్థాయి వసూలు రాబట్టాయి. ఈ సినిమా విజయంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 28వ తారీకు విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటన చేయటం జరిగింది. గత ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు అభిమానులు సోషల్ మీడియాలో తెగా డిస్కషన్స్ చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో జూన్ 4వ తారీఖు ప్రశాంత్ నీల్… జన్మదినోత్సవం నేపథ్యంలో ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకి సంబంధించి పోస్టర్ నీ ఆ చిత్ర నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్స్ వారు ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.

prashanth neel blockbuster good news for junior ntr fans

prashanth neel blockbuster good news for junior ntr fans

దీంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ త్వరలో రాబోతుందని స్పష్టం చేసినట్లు అయింది. ఈ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే స్క్రిప్ట్ వర్క్ పనులు కూడా జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరో ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారెంటీ అని అభిమానులు అనుకుంటున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp