Prashanth Neel: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా ఎస్ ఎస్ రాజమౌళికి ఉన్న రేంజ్ అండ్ క్రేజ్ ఏపాటిదో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. స్టూడెంట్ నెం1 సినిమాతో దర్శకుడిగా మారిన రాజమౌళి సింహాద్రి సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరారు. మగధీర, యమదొంగ, ఛత్రపతి, సై, విక్రమార్కుడు లాంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక్కో సినిమాతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంటూ వచ్చారు జక్కన్న. స్టార్స్‌తో మాత్రమే కాదు కమెడియన్ సునీల్‌తోనూ మర్యాద రామన్న లాంటి చిన్న చిత్రాన్ని తీసి భారీ హిట్ అందుకున్నారు.
ఇక బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియన్ రేంజ్‌కు చేరుకొని దర్శకుడిగా తన సత్తా చాటారు. ఈ సినిమాల తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీలో మిగతా దర్శకులందరూ ఆ స్థాయి సినిమాలను తీయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఎవరూ ఆ రేంజ్‌కు రాలేదనే చెప్పాలి. ఒక్క ప్రశాంత్ నీల్ తప్ప. ఎప్పుడో కన్నడ ఇండస్ట్రీలో ఉగ్రమ్ అనే ఓ సినిమా తీసిన ప్రశాంత్ నీల్ 2019లో కేజీఎఫ్ ఛాప్టర్ 1 అంటూ యష్‌తో భారీ యాక్షన్ సినిమాను తీశారు. ఈ సినిమాతో బాహుబలి సిరీస్‌కు వచ్చినంత క్రేజ్ దర్శకుడిగా ప్రశాంత్ నీల్ అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కన్నడలో భారీ బడ్జెట్ సినిమా అంటే 10 కోట్ల లోపే.
అలాంటిది ఇప్పుడు అక్కడ బడ్జెట్‌కు వెనకాడకుండా సినిమాలు నిర్మిస్తున్నారు. కిచ్చా సుదీప్, యష్ లాంటి వారు హీరోలుగా పాన్ ఇండియన్ సినిమాలలో నటిస్తున్నారు. తెలుగులో రాజమౌళి ఎలాంటి ట్రెండ్ సెట్ చేశారో కన్నడలో ప్రశాంత్ నీల్ అలాంటి ట్రెండ్ సెట్ చేశారు. అంతేకాదు..ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్స్ అందరూ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి సినిమా తర్వాత సినిమా చేస్తూ వస్తున్నారు. ఒక్కో సినిమాకు ఎంత లేదన్నా 3 ఏళ్ళు సమయం తీసుకుంటున్నారు. ఈ విషయంలో కూడా ప్రశాంత్ నీల్ జక్కన్నను మించి పోవడం గ్యారెంటీ అనేంత స్పీడ్‌గా సినిమాను తీస్తున్నారు. త్వరలో కేజీఎఫ్ 2 రాబోతోంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తారని అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. అంతేకాదు..ఇటీవల వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా రేంజ్ హిట్ కేజీఎఫ్ 2 కొడుతుందని ధీమాగా ఉన్నారు. దీనంతటికి కారణం ఒక్క కేజీఎఫ్ 1 సినిమా.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.