Home » Entertainment » Samantha Charges Three Crores
Entertainment

Samantha : మూడు కోట్లకు ఒక్క రూపాయి త‌గ్గ‌నంటున్న స‌మంత‌.. ఇంత డిమాండ్ ఏంట‌మ్మ‌డు..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 11, 2022, 6:00 pm
Advertisement

Samantha: అందాల ముద్దుగుమ్మ స‌మంత జోరు ఇప్పుడు మాములుగా లేదు. దొరికిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌ర‌చుకుంటూ ముందుకు సాగుతుంది. సాధారణంగా పెళ్లి, విడాకుల వంటి సంఘటనల తర్వాత హీరోయిన్లకు అంతగా ఆఫర్స్‌ రావు. కానీ సమంత విషయంలో అది రాంగ్ అని తేలింది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా అదే క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది సామ్‌. వరుస సినిమా అవకాశాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనకు పైగా చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఓ ఇంటర్నేషనల్‌ మూవీ కూడా ఉండటం విశేషం. ఇటీవల తన చిత్రాల్లో ఒకటైన ‘కాతువాకుల రెండు కాదల్‌’ మూవీ విడుదల తేదిని ప్రకిటంచింది సామ్.

Advertisement

ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపిన విషయం తెలిసిందే.ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొన్నాళ్ల క్రితం తన కెరీర్ ముగిసిపోయినట్టే అని చాలామంది అనుకున్నారు. వారందరికీ సమాధానంగా సమంత మరిన్ని సినిమాలతో బిజీ అయిపోయింది. అంతే కాకుండా తన అప్‌కమింగ్ సినిమాల కోసం భారీగా రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట సమంత. తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి, సమంత రెమ్యునరేషన్ మూడు కోట్లు పైనేనట. విజయ్ దేవరకొండ సరసన సమంత ఓ సినిమా చేయనుండ‌గా ఆ సినిమా కోసం సమంత రెమ్యునరేషన్ ఏకంగా మూడు కోట్లు అట.అంత పెద్ద మొత్తం స‌మంత‌కు ఇచ్చేందుకు నిర్మాత‌లు సిద్దంగా ఉన్నార‌ట‌.

samantha charges three crores

Advertisement

Samantha : అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..

బాలీవుడ్ ప్రాజెక్టులతోనూ బిజీగా వున్న సమంత, తన రెమ్యునరేషన్ మూడు కోట్లు.. ఆ పైనే చెబుతోందట . సమంత హీరోయిన్‌గా నటించిన సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒక తమిళ చిత్రం కూడా ఉంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నయనతార, సమంత హీరోయిన్లుగా నటించిన ‘కాతువాకుల రెండు కాదల్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో పాటు తెలుగులో ‘శాకుంతలం’ సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం య‌శోద అనే సినిమా చేస్తుంది. ‘పుష్ప’లోని ఐటెమ్ సాంగ్ కోసం కాసేపటికే రూ. 1.5 కోట్లు తీసుకున్న సమంత.. తన తరువాతి చిత్రం ‘యశోద’ కోసం కూడా రూ.3 కోట్లు ఛార్జ్ చేసింద‌ట‌.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి