Samantha : చీకట్లు తొలిగి వెలుగు రావాల్సిందే!.. సమంతపై ప్రేమను బయటపెట్టిన ప్రీతమ్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: October 8, 2021, 9:01 am

Samantha : సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇంకా హాట్ టాపిక్‌‌గానే ఉంది. విడాకులను అధికారికంగా ప్రకటించి ఆరు రోజులు అయినా కూడా ఈ టాపిక్ ఇంకా ముగియడం లేదు. రోజుకో రకమైన కథనాలు, వార్తలు వస్తూనే ఉన్నాయి. విడాకులు అయితే తీసుకున్నారు. కానీ ఎందుకు తీసుకున్నారు? వారిద్దరి మధ్య ఉన్న గొడవలు ఏంటి? ఎటువైపు నుంచి తప్పు జరిగింది? అనే ప్రశ్నలు మాత్రం అందరినీ తొలిచివేస్తున్నాయి. అలా ఒక్కొక్కరికి వేల చిక్కు ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

Preetham Jukalker ABout Samanth

Preetham Jukalker ABout Samanth

ఇలాంటి సమయంలో ఎన్నో రూమర్లు బయటకు వచ్చాయి. చివరకు సమంత తన స్టైలిష్ట్ ప్రీతమ్ మధ్య కూడా సంబంధాన్ని అంటగట్టేశారు. ఆ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధమే ఈ విడాకులకు కారణమై ఉంటుందని టాక్ బయటకు వచ్చింది. కానీ ప్రీతమ్, సమంతను సరిగ్గా ఫాలో అయి ఉంటే.. ఆ ఇద్దరి రిలేషన్ ఏంటో తెలుస్తోంది. సమంతను జీజూ అని పిలుస్తాడు ప్రీతమ్. అంటే అక్కా అని అంటాడు. అలాంటి వారి మధ్య కూడా రిలేషన్‌ను పెట్టేస్తున్నారు.

Samantha : సమంతపై ప్రీతమ్ ప్రేమ

Samantha Ruth Prabhu Stays Away From Social Media

Samantha Ruth Prabhu Stays Away From Social Media

మొత్తానికి ప్రీతమ్ మాత్రం ఇలాంటి క్లిష్ట కాలంలో సమంతకు అండగా నిలుస్తూ.. సమంత మీద ప్రేమను బయటపెట్టేశాడు. సమంత ప్రస్తుతం ఓ యాడ్ కోసం రెడీ అయింది. దానికి దుస్తులను డిజైన్ చేసింది కూడా ప్రీతమే. అయితే తాజాగా ఆ ఫోటోను షేర్ చేసిన ప్రీతమ్.. ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితిని వివరించాడు. ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. ఎంతటి కారు చీకట్లు అయినా కూడా తొలగిపోవాల్సిందే.. వెలుగులు రావాల్సిందే అంటూ భరోసా ఇచ్చాడు. ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp