Samantha : మా సంబంధం ఏంటో చైతన్యకు తెలుసు.. సమంతపై ప్రీతమ్ సంచలన కామెంట్స్

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 11, 2021, 8:59 am

Samantha : సమంత Samantha నాగ చైతన్య విడాకులు నెట్టింట్లో ఎంతటి చర్చుకు దారి తీశాయో అందరికీ తెలిసిందే. చైసామ్ విడాకుల వార్తలు సెప్టెంబర్‌లోనే మొదలయ్యాయి. ఈ ఇద్దరూ విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారు అని, సమంత ముంబైకి షిఫ్ట్ కాబోతోందని, ఫ్యామిలీ కోర్టు మెట్లు కూడా ఎక్కేశారని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని గత నెలలోనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని మాత్రం అందరూ రూమర్లేనని కొట్టిపారేశారు. కానీ తీరా అక్టోబర్ 2న అవే నిజమయ్యాయి.

Preetham Jukalker On Relation WIth Samantha

Preetham Jukalker On Relation WIth Samantha

తామిద్దరం విడిపోతోన్నామని, ఇకపై భార్యాభర్తలుగా ఉండబోవడం లేదని సమంత, నాగ చైతన్య ఉమ్మడి ప్రకటన చేశారు. అక్కడితో కథ కొత్త మలుపులు తిరిగింది. అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారు.. ఏం జరిగింది అనే కోణంలో మీడియా, సోషల్ మీడియాలో కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. సమంత, తన డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ మధ్య రిలేషన్ ఉందని, అందుకే చైతూ విడాకులు ఇచ్చేశాడని కొందరు ప్రచారాన్ని మొదలుపెట్టేశారు.

Samantha సమంతతో రిలేషన్‌పై ప్రీతమ్

Who is pritam jukalkar He said I love u to samantha

Who is pritam jukalkar He said I love u to samantha

సమంత తన అఫైర్ల గురించి వచ్చిన వార్తలను ఖండించింది. సమంత ఫ్రెండ్ సాధన అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సమంతను ప్రీతమ్ అక్కా అని పిలుస్తాడంటూ సాధన చెప్పింది. తాజాగా ప్రీతమ్ స్పందించాడు. ఓ మీడియాతో మన మనసులోని బాధను చెప్పాడు. సమంతను నేను అక్కా అని పిలుస్తాను.. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో చైతన్యకు తెలుసు అంటూ ప్రీతమ్ జుకాల్కర్ అసలు సంగతి చెప్పేశాడు. దీంతో ఇప్పటికైనా ఆ రూమర్లకు తెరపడుతుందో లేదో చూడాలి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp