Pridhvi raj Sukumaran : ‘ సలార్ ‘ సినిమా ద్వారా పృధ్విరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చారు. మలయాళం లో పృధ్విరాజ్ స్టార్ హీరో. ఆయన తల్లిదండ్రులు కూడా మలయాళం లో స్టార్స్. నందళం సినిమాతో మలయాళం లో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీరాజ్ సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక మలయాళం లో ‘ లూసీఫర్ ‘ సినిమాకు దర్శక నిర్మాతగా వ్యవహరించారు. స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు స్టార్ హీరోలతో దర్శకత్వం వహించేవారు. ఇక సలార్ కోసం దర్శకుడు ప్రశాంత నీల్ ని కలిసినప్పుడు నో చెప్పాలనుకున్నారట. ఎందుకంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో ఉన్నప్పుడు తనకు ఒక చిన్న పాత్ర ఇచ్చి ఉంటారని నో చెప్పాలనుకున్నారట. కానీ స్టోరీ విన్నాక ఈ సినిమా చేస్తానని చెప్పారట.
హీరో లాంటి విలన్ క్యారెక్టర్ ఉందని బాగా ఎక్సైట్ అయ్యారట. ఇప్పుడు పాన్ ఇండియాలో పృధ్వీరాజ్ పేరు మారుమ్రోగిపోతుంది. ఇక పృధ్విరాజ్ వ్యక్తిగత విషయానికి వస్తే జర్నలిస్ట్ సుప్రియ మీనన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె ముంబై పాలిటిక్స్ తోపాటు సినిమాలు, బిజినెస్ కవర్ చేసేవారు. ఇక మలయాళీ కావడంతో మలయాళ సినిమాలు కూడా కవర్ చేసేవారు. ఆ క్రమంలోనే పృధ్విరాజ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే ముంబైలో షూటింగ్ ఉండడంతో పృథ్వీరాజ్ సుప్రియ ను కలిశారట. సిటీ చూపించమని క్యాజువల్ గా అడిగారట. అప్పటివరకు ఆమెపై పృథ్విరాజ్ కు ఆసక్తి కూడా లేదు. జర్నలిస్టుగా ఫ్రెండ్ గానే చూశారు. అయితే ముంబైలో తను బస చేసే చోట సుప్రియ బ్రేక్ ఫాస్ట్ కి పిలిచారు.
సిటీ చూపించమనడంతో వారం పాటు కారులోనే ముంబై మొత్తం తిరిగారు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఒకరోజు పృథ్వీరాజ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. సుప్రియ కూడా ఇష్టపడడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప పుట్టింది. పెళ్లి తర్వాత సుప్రియ జర్నలిజం వదిలేశారు. నేటికి పృధ్విరాజ్ నిర్మించే సినిమా బాధ్యతలను ఆమె చూసుకుంటారు. అయితే స్టార్ హీరోగా ఉన్నప్పుడు రూమర్స్ అనేవి వస్తుంటాయి. అలాగే పృధ్విరాజ్ మీరాజాస్మిన్ తో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అప్పుడు పృథ్వి కి పెళ్లి కాలేదు. అయితే పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ తో రూమార్స్ రాలేదు. ఇప్పుడు సలార్ సినిమాతో పాన్ ఇండియా యాక్టర్ అయిపోయారు పృథ్వీరాజ్.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.