Ys Jagan : బిగ్ బ్రేకింగ్‌.. విద్యార్థుల‌కు మ‌రో గుడ్‌న్యూస్ చెప్పిన జ‌గ‌న‌న్న‌..!

Ys Jagan  : ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న విద్యా దీవెన నిధులను విడుదల చేయబోతోంది. జూలై , సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి 584 కోట్లను 8,09,039 మంది విద్యార్థుల కోసం ఇస్తుంది. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ డబ్బును బటన్ నొక్కి తల్లుల విద్యార్థులు జాయింట్ బ్యాంక్ అకౌంట్లలో నేరుగా ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జమ చేయబోతున్నారు. దాంతో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుందని సంతోషంలో ఉన్నారు. అందువల్ల సీఎం బటన్ నొక్కిన తర్వాత లబ్ధిదారులు తమ ఎకౌంట్లో డబ్బు వచ్చింది లేనిది చూసుకోవాలి. ఇవాళ ఎకౌంట్లో డబ్బు రాకపోతే బ్యాంక్ అధికారులను సంప్రదించవచ్చు. జగనన్న విద్యా దీవెన కింద ఇవాళ వస్తున్న 584 కోట్లతో కలిపి ఇప్పటివరకు విద్యా దీవెన వసతి దీవెన పథకాల కింద వైసీపీ ప్రభుత్వం రూ. 18,576 కోట్లు ఇచ్చినట్లు అవుతుంది.

ఇది గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ అని ప్రభుత్వం చెబుతోంది. వై.యస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలు చేశారుష పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలని ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఐటిఐ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించే ఫీజులను వారి బదులు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకోసం మూడు నెలలకు ఒకసారి డబ్బుని లబ్ధిదారుల ఎకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఆ డబ్బును మధ్యవర్తులు ఎవరు పొందే అవకాశం లేకుండా నేరుగా తల్లుల ఎకౌంట్లో జమ అవుతాయి. ఆ తర్వాత కాలేజీల యాజమాన్యాలు వారి నుంచి ఆ డబ్బును తీసుకుంటున్నాయి.

పేద విద్యార్థులు భోజనం, హాస్టల్ ఖర్చులకోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో వైసీపీ ప్రభుత్వం ఐటిఐ విద్యార్థులకు రూ.10,000 పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15000,డిగ్రీ , ఇంజనీరింగ్ , మెడిసిన్ వంటి కోర్సులు చేసే వారికి 20 వేల చొప్పున డబ్బును అందిస్తుంది. దీని ద్వారా విద్యార్థులు డబ్బు సమస్యలు లేకుండా చదువుకోడానికి వీలవుతుందని జగన్ సర్కార్ చెబుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్ల కాలంలో విద్యారంగంపై రూ. 73,417 కోట్లు ఖర్చు చేసినట్లు అవుతుంది. ఈ పథకాల ప్రయోజనం పొందుతున్న విద్యార్థులు రేపు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వం ఆశిస్తుంది. వారి ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ప్రభుత్వం నమ్ముతుంది. పేద విద్యార్థులు డబ్బు లేక చదువు ఆపకూడదని జగన్ సర్కార్ ఇలాంటి పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా చాలామంది పేద విద్యార్థులు చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీనివలన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.

Recent Posts

Olive Oil | ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ .. జీర్ణక్రియకు అద్భుత ప్రయోజనాలు!

నేటి వేగవంతమైన జీవనశైలిలో జీర్ణ సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతి రోజు ఉదయం…

4 hours ago

Ajith | ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 29 శ‌స్త్ర చికిత్స‌లు జ‌రిగాయి.. అజిత్ కామెంట్స్

Ajith | తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే…

7 hours ago

Cricketer | మాజీ క్రికెటర్ రాజేష్ బానిక్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం.. క్రికెట్ లోకం షాక్!

Cricketer | భారత క్రికెట్‌లో ఒకవైపు మహిళల జట్టు వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన ఆనందం నెలకొనగా, మరోవైపు క్రికెట్ ప్రపంచం…

8 hours ago

BRS | మణుగూరులో ఉద్రిక్తత ..బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

BRS | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య…

9 hours ago

cervical Pain | సర్వైకల్ నొప్పి ముందు శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదు!

cervical Pain | నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్ వాడకం పెరగడం, తప్పుడు…

10 hours ago

Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్‌ అవసరం లేదు! .. యాపిల్‌ జ్యూస్‌లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు

Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు” ఈ మాట మనందరికీ బాగా…

13 hours ago

Rose Petals | గులాబీ రేకులు అందం మాత్రమే కాదు ..ఆరోగ్యానికి కూడా వరం, లాభాలు తెలిసే ఆశ్చర్యపోతారు!

Rose Petals | గులాబీ పువ్వులు అందం, సువాసనకు ప్రతీకగా నిలుస్తాయి. కానీ ఈ సుగంధ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే…

14 hours ago

Ivy gourd | మధుమేహ రోగులకు వరం ..దొండకాయలో దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు!

Ivy gourd | మన రోజువారీ ఆహారంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌,…

15 hours ago