
#image_title
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు అందరూ ఇంటికి దూరం అయి నెల దాటింది. దీంతో తమ కుటుంబ సభ్యులను అందరూ తెగ మిస్ అవుతున్నారు. అందుకే ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి నుంచి కంటెస్టెంట్ల కోసం వచ్చిన లెటర్స్ ను అందిస్తాడు. కానీ.. అది టాస్క్ లో భాగంగా.. లెటర్స్ ను అడ్డం పెట్టుకొని బిగ్ బాస్ గేమ్ ఆట ఆడటం, కంటెస్టెంట్లతో ఆడించడం చూసి కంటెస్టెంట్లే కాదు.. ప్రేక్షకులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. నెల రోజులు దాటింది. ఇంటి నుంచి వచ్చే లెటర్ అనగానే ఎవరికైనా ఆ లెటర్ చూడగానే ఏడుపు వస్తుంది. కానీ.. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇద్దరు బడ్డీలలో ఒక బడ్డీ లెటర్ ను త్యాగం చేయాలి. మరో బడ్డీ లెటర్ చదివి కెప్టెన్ కు కంటెండర్ అవుతాడు అని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెడతాడు. దీంతో ఇంటి సభ్యులకు ఏం చేయాలో అర్థం కాదు.
గౌతమ్, శుభశ్రీలో శుభశ్రీ తన లెటర్ ను త్యాగం చేయడంతో గౌతమ్ ఆ లెటర్ చదివి మొదటి కెప్టెన్సీ టాస్క్ కు కంటెండర్ గా నిలుస్తాడు. ఇక.. తేజ, యావర్ లో తేజ ఆ లెటర్ ను త్యాగం చేస్తా అని చెబుతాడు. యావర్ ను అలా చూడలేకపోతున్నా. వాళ్ల అన్నను చూడాలని చాలా రోజుల నుంచి అంటున్నాడు అని బిగ్ బాస్ కి చెబుతాడు. యావర్ కూడా వాళ్ల అన్న రాసిన లెటర్ చూసి కింద పడి వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఆ లెటర్ చూసి అస్సలు తన ఏడుపును ఆపుకోలేకపోతాడు యావర్. ఏం చేయాలో యావర్ కు అర్థం కాదు. యావర్ బాధ చూడలేక నేను లెటర్ ను త్యాగం చేస్తా నువ్వే ఆ లెటర్ ను చదువుకో.. అంటూ తన లెటర్ ను కూడా ఇచ్చేస్తాడు తేజ. కానీ.. యావర్ మాత్రం తన లెటర్ ను అందులో వేసి స్మాష్ చేస్తాడు. దీంతో తేజకు ఏం చేయాలో అర్థం కాదు.
#image_title
తేజ ఎంత చెప్పినా కూడా యావర్ వినడు. నేను ఒకరిని బాధపెట్టి నేను సంతోషంగా ఉండలేను. అందుకే నువ్వే ఆ లెటర్ చదువు.. ఈసారి నీకు కంటెండర్ అనేది ముఖ్యం. నేను ఇప్పటికే రెండు మూడు సార్లు కంటెండర్ అయ్యాను.. అంటూ యావర్ తేజకు చాన్స్ ఇస్తాడు. మొత్తానికి బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో అందరినీ ఏడిపించేశాడు. లెటర్స్ ఇవ్వకుండా కంటెస్టెంట్లనే కాదు.. ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులను కూడా బిగ్ బాస్ ఏడిపించేశాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.