Priyamani : భర్తతో గొడవలు.. నిజాలు బ‌య‌ట‌పెట్టిన ప్రియమణి..!

Priyamani : కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే హీరోయిన్ ప్రియమణి ముస్తఫా రాజ్ ని పెళ్ళి చేసుకొని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే అది కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదని ఆమె కూడా అనుకోలేదు. సినిమాలు చేయాలా వద్దా అని డైలమాలో ఉన్న వేళ భర్త ముస్తఫా రాజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎంకరేజ్ చేయడంతోనే మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. పెళ్ళి తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చి గ్యాప్ తీసుకున్న ప్రియమణికి రాజ్ అండ్ డీకే వచ్చి ఓ ప్రపోజల్ పెట్టారు. అదే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1. కథ కూడా నరేట్ చేశారు.

priyamani-once again got star status by family man

కానీ ఇప్పుడు సినిమాలు ఎందుకు అన్న సందేహంలో కూర్చుందట . అప్పటికే చాలా సేపు ఈ వెబ్ సిరీస్ లో చేయమని ఈ దర్శక ద్వయం చర్చిస్తుండటంతో భర్త ముస్తఫా రాజ్ వచ్చి ఇది నీకోసమే వచ్చిన అవకాశం. వాళ్ళు ఈ క్యారెక్టర్ నువ్వు మాత్రమే చేయాలనుకుంటున్నప్పుడు ఆలోచించడం ఎందుకు ఓకే చెప్పు అని సపోర్ట్ చేశాడట. దాంతో ఈమె మళ్ళీ నటించడానికి ఓకే చెప్పింది. ఆ రకంగా వెబ్ సిరీస్ లో నటించి బాలీవుడ్ లో బాగా పేరు తెచ్చుకుంది. ఇది హిట్ అయ్యాకే మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు తలుపు తట్టాయి. ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ భాషలలో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఇక పెళ్ళి తర్వాత తనకి భర్త రూపంలో గొప్ప సపోర్ట్ లభించిందని తెలిపిన ఈమె, అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతాయని, అప్పుడు కూడా భర్తే తగ్గుతాడని సరదాగా చెప్పుకొచ్చింది.

Priyamani : : అందుకే అందరు ఇప్పుడు డిజిటల్ రంగం మీద ఆసక్తి చూపిస్తున్నారు.

priyamani revealed conflicts with husband

వెంకటేశ్ తో ‘నారప్ప’, రానాతో ‘విరాట పర్వం’ సినిమాలు ఒకేసారి చేసింది. లక్కీగా ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు హిట్ అయితే ప్రియమణి క్రేజ్ మళ్ళీ టాలీవుడ్ లో బాగా పెరుగుతుంది. ఇదే సమయంలో నిర్మాతలకి ఈమె సపోర్ట్ చేస్తూ తన రెమ్యునరేషన్ తగ్గించుకుంది. ఇది ప్రియమణిలో ఉన్న మరో గొప్ప విషయం. రీసెంట్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా వచ్చి పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అటు తమిళం, హిందీ ఇటు తెలుగులో అవకాశాలు వస్తున్నాయట ప్రియమణికి. మొత్తానికి కరోనా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించినప్పటికి అదే సమయంలో ఓటీటీలకి ప్రాధాన్యం పెరిగి డిజిటల్ ప్లాట్ ఫాం లలో ప్రియమణి లాంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు దక్కుతున్నాయి. అందుకే అందరు ఇప్పుడు డిజిటల్ రంగం మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత ఈ రూట్ లో సక్సెస్ అయ్యారు. ఇక బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ విద్యాబాలన్ ప్రియమణి కజిన్స్. కానీ సినిమాల పరంగా విద్యాబాలన్ హెల్ప్ ఎప్పుడూ తీసుకోలేదు. హిందీలో ‘మైదాన్’ తో పాటు మరో రెండు సినిమాలు చేస్తోంది.

Recent Posts

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

3 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

6 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

8 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

20 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

23 hours ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

1 day ago

Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…

1 day ago