priyanka chopra first photo shoot after baby birth
Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన నటనతో ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియాంక 2018 డిసెంబర్‌లో నిక్ ని పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్‌లోని ఉమైద్ భవన్ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు.అయితే పెళ్లి తర్వాత వీరు సంతోషంగా జీవనం సాగిస్తుండగా, మధ్యలో విడాకులు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని వీరు ఖండించారు. ఇక రీసెంట్‌గా సరోగసి ద్వారా ప్రియాంక- నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి. ధన్యవాదాలు..’ అని రాసుకొచ్చింది.బిడ్డ పుట్టిన తర్వాత ప్రియాంక చోప్రా మిర్రర్ సెల్ఫీ తీసుకున్న పిక్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది .అది సన్ కిస్డ్ ఫొటోలా అందంగా ఉంది. కొంచెం మేకప్, బ్లాక్ సన్‌గ్లాసెస్‌తో కార్ రైడ్ చేస్తూ ఈ ఫొటో దిగింది. ఈ పిక్కు ‘కాంతి సరిగ్గా అనిపిస్తుంది’ అని క్యాప్షన్ రాసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు మమ్మీ అని పిలవడం దగ్గర్నుంచి ప్రియాంక అందాన్ని వర్ణించడం వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ పిక్స్ కి కొద్ది గంటలలోనే భీబత్సంగా లైక్ లు వచ్చాయి.
priyanka chopra first photo shoot after baby birth
ప్రియాంక చోప్రా గత సంవత్సరం విడుదలైన అన్ ఫినిష్డ్ పుస్తకంలో పీసీ తన బలహీనతలను బహిర్గతం చేయడం గురించి కూడా మాట్లాడింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి సృష్టించిన విధ్వంసాన్ని ఉదహరిస్తూ.. ఈ సమయంలో శాంతి చాలా ముఖ్యమైనదని అన్నారు. నేను ప్రేమను అందించే వ్యక్తుల కోసం చూస్తున్నాను. నేను శాంతియుతంగా ఉండే వ్యక్తుల కోసం చూస్తున్నాను. నేను ఆనందంతో కాంతితో నన్ను నేను ఉంచాలనుకుంటున్నాను. మీకు తెలుసా నేను ఇప్పుడు లైట్నింగ్ కోసం వెతకడం ప్రారంభించానని అనుకుంటున్నాను. మనిషిగా ఇది మనలో చాలా మందిని మార్చిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి అది నన్ను మార్చింది. నేను ఆ అస్తవ్యస్తమైన వేగాన్ని అస్తవ్యస్తమైన ప్రపంచాన్ని ఇకపై భరించగలనో లేదో నాకు తెలియదు. నేను ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను“ అని కాస్త ఎమోషనల్ ఇంటర్వ్యూని ఇచ్చింది.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.