
priyanka singh grand welcome to after her elimination from bigg boss 5 Telugu
priyanka singh : బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. అంతా అనుకున్నట్లు గానే పదవ మూడవ వారం ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. పింకీ ఎలిమినేషన్ గురించి ముందుగానే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ముందు నుంచి అంతా ఈసారైనా ఓ ట్రాన్స్‌జెండర్ ఫినాలేలో అడుగుపెడుతుందని అనుకున్నారు. ఆడియన్స్ తో పాటు ప్రియాంక ఆశలు అడియాశలు గానే మిగిలిపోయాయి. టాప్ 5లో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన పింకీ.. ఇంకో 2 వారాల్లో బిగ్ బాస్ సీజన్ 5 ముగియనున్న వేళ ఎట్టకేలకు బయటకురావాల్సి వచ్చింది. అయితే ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె అభిమానులు ఆమెకు వెల్ కమ్ చెప్పిన తీరు అద్భుతమని చెప్పాలి.
గత రాత్రి బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక బయటకొచ్చినట్టున అనంతరం.. ఆమె బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే అక్కడ ఆమెకు ఊహించని స్వాగతం లభించింది. ప్రియాంకకు తన ఇంటి వద్ద భారీ ఎత్తున డీజేతో ఆమెకు వెల్ కమ్ చెప్పారు అభిమానులు. యాంకర్ రవికి కూడా ఈ స్థాయిలో వెల్ కమ్ లభించలేదని చెప్పాలి. ప్రియాంకకు వెల్ కం చెప్పేందుకు హౌస్ లోని ఆమె స్నేహితుడు జెస్సీ సైతం అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పింకీ ఎలిమినేట్ అవుతుందని మీరు ముందే ఊహించారా? అని మీడియా జెస్సీను అడగగా…
priyanka singh grand welcome to after her elimination from bigg boss 5 Telugu
ఆయన దానికి అవును అని సమాధానం ఇచ్చారు. ఈ మాటలకు ఒక్కసారిగా షాక్ కు గురైన పింకీ.. నువ్వు అలా చెప్పకూడదు కదా?’ అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. మరో అడుగు ముందుకేసి.. తన కెప్టెన్సీ సమయంలో పింకీ అస్సలు తన మాట వినేది కాదని.. అందుకే బయటకు వచ్చేసిందని కామెంట్ చేశాడు. దీనిపై నవ్వుతూ స్పందించిన ప్రియాంక.. తాను అందరు కెప్టెన్లను టార్చర్ చేశానని రిప్లై ఇచ్చారు. 19 మందితో మొదలైన బిగ్ బాస్ 5 లో ప్రస్తుతం ఆరు మంది మిగిలారు. సన్నీ, మానస్, శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సిరి, కాజల్ మాత్రమే ఇంట్లో ఉన్నారు.ఈ వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయితే.. మిగిలిన ఐదుగురిలో ఒకరు విజేతగా నిలుస్తారు.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.