Janaki Kalaganaledu 6 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 186 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఈ ఇంటిని ఒక తాటి మీద నడిపించగలరని అమ్మ చెప్పిన మాటను మరోసారి నిజం చేశారు అని జానకితో అంటాడు రామా. ఇంతలో రాత్రి అవుతుంది. రామా.. తన రూమ్ లోకి వస్తాడు. జానకి కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. తనను చూసి తెగ ముచ్చటపడుతాడు. నా బంగారం నా భార్య అని అనుకుంటాడు. ఇంతలో తనకు ఒక ఆలోచన వస్తుంది. డోర్ మూసి.. పోలీస్ క్యాప్ ను తీసుకొచ్చి తన తలమీద పెడతాడు. తనకు సెల్యూట్ కొడతాడు. పోలీస్ క్యాప్ పెట్టగానే తను అచ్చం పోలీస్ లా కనిపిస్తుంది. తను పోలీస్ ఆఫీసర్ అయినట్టు.. ఒకసారి ఊహించుకుంటాడు రామా.
అబ్బబ్బ.. మీరు ఏం కొట్టారు అండి అంటూ తనకు తనే మాట్లాడుకుంటుంటే.. ఇంతలో జానకి నిద్రలేచి.. ఏమైంది అంటుంది. ఏంటి అంటుంది. ఈ క్యాప్ నాకెందుకు పెట్టారు అంటుంది జానకి. మీరు పెట్టుకుంటే బాగుంటుందని పెట్టాను అంటాడు రామా. దీంతో చూడండి శ్రీవారు.. నేను మీ ఐపీఎస్ జానకిని కాదు.. మీ శ్రీమతి జానకిని. ఐపీఎస్ అనేది చెదిరిపోయిన కల. కలలో కూడా ఈ ఊహలను తెచ్చుకోకండి. అర్థం అయింది కదా శ్రీవారు అంటుంది జానకి. చదువులో మీకు వచ్చిన మార్కులను బట్టి మీ తెలివి ఎంతో తెలిసింది. ఐపీఎస్ కల మీకు ఎంత ముఖ్యమో తెలుసు. మీ ప్రతిభ ఈ నాలుగు గోడలకే పరిమితం కాకూడదు. మీరు ఐపీఎస్ జానకి కావాల్సిందే అంటాడు రామా. కానీ.. జానకి మాత్రం ఒప్పుకోదు. నేను ఈ ఇంటి కోడలుగా ఉంటేనే నాకు ఇష్టం. మనం కనే అన్ని కలలు నిజం అవుతాయా? నా ఐపీఎస్ కలను మీరు కూడా మర్చిపోండి అని చెప్పి వెళ్లిపోతుంది జానకి.
జానకి వెళ్లిపోయాక.. తన నాన్న ఇచ్చిన పెన్నును చూసి మరోసారి తన ఐపీఎస్ కలను గుర్తుతెచ్చుకుంటాడు. మీకు ఐపీఎస్ కల మాత్రమే కానీ.. మీ నాన్న గారికి జీవితాశయం. ఎవరు అడ్డు వచ్చినా.. మిమ్మల్ని ఐపీఎస్ ను చేస్తాను. అప్పుడే నేను నా భార్య కలను నిర్వర్తించే భర్తగా నేను గెలిచినట్టు.. అని అనుకుంటాడు రామా.
ఇంతలో జానకి అన్నయ్య యోగి రామాకు ఫోన్ చేసి.. నాన్న గారి నెల మాస్కం ఉంది రేపు. జానకి గారిని తీసుకొని గోదావరి ఒడ్డుకు రండి అని చెబుతాడు యోగి. సరే.. బావగారు తీసుకొని వస్తా అంటాడు. రేపు ఆ కార్యక్రమం పూర్తవగానే మేము అమెరికా వెళ్లిపోతున్నాం అంటాడు యోగి.
ఉదయమే యోగి.. తన నాన్నకు నెలమాస్కం నిర్వహిస్తుంటాడు. అంతలోనే జానకి, రామా ఇద్దరు వస్తారు. జానకి కంటతడి పెట్టుకుంటుంది. పిండాలు తీసుకెళ్లి నదిలో కలపండి అని చెబుతాడు పంతులు. ఓవైపు యోగి నదిలో పిండం కలుపుతుంటే.. జానకి వెక్కి వెక్కి ఏడుస్తుంది. జానకి గారు ఊరుకోండి అంటాడు రామా.
మా నాన్న ప్రతిక్షణం నా గురించే ఆలోచించేవారు. ప్రతిక్షణం నా కల గురించే ఆలోచించేవారు. అమ్మ జాను.. నిన్ను ఐపీఎస్ గా చూడాలి. అప్పుడే నేను తండ్రిగా గెలిచినట్టు అని మా నాన్న నాతో ఎప్పుడూ చెప్పేవారు. కానీ.. ఆ దేవుడికి నిజంగా జాలి లేదు. మా నాన్నకు ఆ సంతోషాన్ని దక్కకుండానే తీసుకెళ్లిపోయాడు అంటుంది జానకి.
మా అమ్మానాన్న దూరమై ఆ దేవుడి దగ్గర ఉన్నాసరే.. వాళ్ల ఆత్మకు శాంతి ఉండదు. నా గురించే తలుచుకొని కుమిలిపోయి ఉంటారు అని అంటుంది జానకి. మీ కన్నవాళ్ల ఆత్మకు శాంతి లేకుండా పోవడానికి ఆ దేవుడు మాత్రమే కాదు మీరు కూడా ఒక కారణమే అంటాడు రామా.
ఒక మనిషిని ఈ భూమ్మీదకు తీసుకురావడం.. తిరిగి తీసుకెళ్లిపోవడం.. ఆ దేవుడి లీలలో భాగం. కానీ.. బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడం.. పిల్లల బాధ్యత. మీరు మీ ఐపీఎస్ కలను వదిలేసి మీ నాన్నను బాధపెడితే ఎలా. మీరు పరీక్ష రాయడానికి.. ఈ పెన్ను మీకు బహుమానంగా ఇవ్వడానికి మీ నాన్నగారు ఎంతో పరితపించారు. కానీ.. ఆయన ఇవ్వలేకపోయారు.
ఆయన ఇవ్వలేక.. నాతో పంపించారు. ఇది పెన్ను మాత్రమే కాదు. మీ ఐపీఎస్ కల. మీరు ఐపీఎస్ గా చూడాలనుకున్న మీ నాన్న కలను వదిలేయాలనుకుంటే.. ఈ పెన్నును కూడా తీసుకెళ్లి ఆయన ప్రాణాలు వదిలేసిన ఈ గోదాట్లోనే కలిపేసేయండి అంటాడు రామా. అంతకంటే ముందు ఈ పెన్నును మీ నాన్నగారి ఫోటో ముందు పెట్టి ఆ తర్వాత నిర్ణయం తీసుకో అంటాడు.
దీంతో ఏం చేయాలో జానకికి అర్థం కాదు. నాన్న నేను ఐపీఎస్ అయి తీరుతానని మీ చితి మంటల సాక్షిగా ప్రమాణం చేశాను కానీ.. విధి నన్ను ఓడించింది నాన్న. నేనిప్పుడు ఒక ఇంటి కోడలును. నాకు ఇఫ్పుడు అత్తారింటి బాధ్యతలు తప్ప.. పుట్టింటి కలలు ఉండవు నాన్న.
అందుకే భవిష్యత్తులో నేను నా చదువు గురించి.. చదువుకున్న విషయాన్ని పూర్తిగా మరిచిపోతానని నేను మా అత్తయ్య గారికి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడం కోడలుగా నా ధర్మం. నేను ఐపీఎస్ కల కోసం అడుగులు ముందుకేస్తే.. మా అత్తారింటిని బాధపెట్టిన దాన్ని అవుతాను. అలా బాధపెడితే.. కోడలుగా ఓడిపోయినట్టే కదా.
నువ్వు కలలు కన్న నా ఐపీఎస్ కలను నిజం చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించు నాన్న అంటుంది జానకి. పెన్ను కింద పడేయబోతుంది. ఇంతలో రామా ఆ పెన్నును అందుకుంటాడు. ఆరోజు మీ నాన్నగారు పెన్ను వదిలేస్తుంటే పట్టుకున్నాను. ఈరోజు మీరు వదిలేస్తుంటే పట్టుకున్నాను అంటాడు రామా. నీ కలను నిజం చేయడం కోసమే ఈ పెన్నును పట్టుకున్నాను అని.. అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.