Suresh Babu : టాలీవుడ్ లో సురేష్ ప్రొడక్షన్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఈ సంస్థ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. దగ్గుబాటి ఫ్యామిలీలో ప్రొడ్యూసర్ గా సురేష్ , హీరోగా విక్టరీ వెంకటేష్ సక్సెస్ అయ్యారు. కానీ వారి వారసులు అంతగా సక్సెస్ కాలేకపోయారు. ఇక సురేష్ పెద్ద కొడుకు రానా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. మిగతా వాళ్లలా కాకుండా సురేష్ తన పెద్ద కొడుకు రానా లాంచింగ్ విషయంలో కొంచెం భిన్నంగా ఆలోచించారు. అతడిని మాస్ హీరోని చేయాలని అనుకోలేదు. శేఖర్ కమ్ముల రూపంలో ట్రెండీ డైరెక్టర్ నే ఎంచుకున్నాడు.
లీడర్ లాంటి కంటెంట్ ఉన్న సినిమాతో కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మొదటి సినిమాలో రానా బాగా హైలైట్ అయ్యేలా తన క్యారెక్టర్ సాగింది. అలాగే నటనకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సురేష్ చిన్న కొడుకు అభిరామ్ విషయంలో మాత్రం తప్పు జరిగిపోయింది. తేజా లాంటి సీనియర్ డైరెక్టర్ తో అభిరామ్ సినిమా చేయడం చాలా పెద్ద తప్పు. మనకు తెలిసిందే రానా తమ్ముడు అభిరామ్ ఇటీవల ‘ అహింస ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో అభిరామ్ లుక్స్, పర్ఫామెన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు.
అసలే అభిరామ్ వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాల వల్ల అతడి మీద జనాలలో నెగటివ్ అభిప్రాయం ఏర్పడింది. అందులోనూ తన లుక్స్ అంతంత మాత్రం. అలాంటప్పుడు మంచి గెటప్ వేయించి తనం పాత్ర కోసం ఎలివేట్ అయ్యే ట్రెండీ కథ ఎంచుకోవాల్సింది. మొత్తం మీద మొదటి సినిమాకు సంబంధించి తప్పు మీద తప్పు జరిగిపోయి అతడి సినిమాను ప్రేక్షకులను పట్టించుకోవట్లేదు. సినిమా చూసిన వాళ్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. సురేష్ చేతిలో తరుణ్ భాస్కర్ లాంటి యంగ్ ట్రెండీ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ తన చిన్న కొడుకుని తేజ లాంటి పాత డైరెక్టర్ చేతిలో పెట్టడం ఆయన చేసిన పెద్ద తప్పు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.