Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!
ప్రధానాంశాలు:
Samantha - Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు ... సోషల్ మీడియాలో దుమారం..!
Samantha – Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని, నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ తమ తమ జీవనశైలిలో ముందుకెళ్తున్నప్పటికీ, వీరి విడాకులపై అభిమానుల్లో చర్చలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ సైకాలజిస్ట్ ఎస్. వి. నాగనాథ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, సమంతపై తీవ్ర విమర్శలు చేశారు.

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!
Samantha – Naga Chaitanya : అలా అన్నాడేంటి…
విడాకుల అనంతరం సమంత పూర్తిగా సింపతీ కోసమే పనిచేసింది. మీడియా, ఈవెంట్స్ వేదికలపై తాను మోసపోయినట్టు చూపిస్తూ ప్రజల మనసులను గెలుచుకోవడానికి ప్రయత్నించింది. అసలే నటీమణి కావడంతో సమాజంలో తనపై హాని కలుగకుండా ఉండేందుకు పకడ్బందీగా ప్రవర్తించింది అని నాగనాథ్ ఆరోపించారు.
అలాగే, నాగ చైతన్య ఈ విడాకుల వ్యవహారంలో నిజమైన బాధితుడని నాగనాథ్ అభిప్రాయపడ్డారు. చైతన్య తన జీవితం గురించి చాలా క్లియర్‌గా ఆలోచించే వ్యక్తి. సమంతతో పోలిస్తే అతను 100 శాతం మెరుగైన వ్యక్తి. కానీ సమంత ప్రవర్తన వల్ల అతనికి చాలా మానసిక ఒత్తిడి తలెత్తింది. విడాకుల అనంతరం కూడా తన గౌరవాన్ని కాపాడుకుంటూ మౌనంగా ఉండిపోయాడు,” అని పేర్కొన్నారు. “చైతన్య మొదట పెళ్లికి ఓకే చెప్పకపోతే, సమంత కొన్ని మార్గాల్లో ఒత్తిడి తెచ్చిందని, చివరకు పెళ్లి జరిగిందని” తెలిపారు. అయితే అది ఓ ముదురు ఆలోచనగా మారిపోయిందని, చివరకు విడాకులు తీసుకోవడం తప్పలేనట్టు అయిందని అన్నారు