Punch Prasad punches in jathi ratnalu Latest Promo
Punch Prasad : బుల్లితెరపై పంచ్ ప్రసాద్ ఒకప్పుడు అంతగా ఫేమస్ కాదు. జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో స్కిట్లు వేశాడు. ఎంతో మంది వద్ద పని చేశాడు. ఎన్నో టీంలలో తిరిగాడు. అయితే మధ్యలో అతనికి ఆరోగ్యం బాగా లేకుండాపోయింది. రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో పంచ్ ప్రసాద్ మీద ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక అతను బతకడం కష్టమని కూడా అన్నారు. అయితే అందరి సాయంతో వైద్యానికి సరిపడా డబ్బులు వచ్చాయి. కానీ కిడ్నీ దొరకలేదు. తన భార్యే తనకు కిడ్నీ ఇవ్వబోతోందని పంచ్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఓ ఈవెంట్‌లో తన భార్య గురించి చెప్పడం, పంచ్ ప్రసాద్ లవ్ స్టోరీ బయటకు రావడం, అతని భార్య ఎమోషనల్ అవ్వడంతో అప్పటి నుంచి పంచ్ ప్రసాద్ ఇమేజ్ మారిపోయింది. పంచ్ ప్రసాద్ తన పంచ్‌లతో మరింత ఫేమస్ అయ్యాడు.
ఇక ఇప్పుడు నెలకు మూడున్నర లక్షలు సంపాదిస్తున్నాడని ఆది చెప్పుకొచ్చాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జాతి రత్నాలు అంటూ ఫుల్ బిజీగా ఉన్నాడంటూ నెలలో ఖాళీగా ఉండే రోజులు కూడా ఉండటం లేదని అన్నారు. అలా పంచ్ ప్రసాద్ మాత్రం ఇప్పుడు తెరపై ఫుల్ బిజీగా కనిపిస్తున్నాడు. ఇక జాతిరత్నాలు కార్యక్రమంలో పంచ్ ప్రసాద్ మీద అందరూ పంచులు వేస్తుంటారు. చివరకు అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ పంచులు వేస్తుంటారు. తాజాగా ఓ స్టూడెంట్ ఇలా అన్నాడు. బావిలో ఉండేవి కప్పలు.. నీ వల్లే మాకు ఈ తిప్పలు అని కౌంటర్ వేస్తాడు. దాంతో ప్రసాద్ మొహం మాడిపోయినట్టు అవుతుంది. ఇక మరో సందర్భంలో శ్రీముఖి, నూకరాజులు కౌంటర్లు వేస్తారు.
Punch Prasad punches in jathi ratnalu Latest Promo
వీరంతా కలిసి రంగస్థలం స్పూప్ వేశారు. జగపతి బాబు పాత్రలో పంచ్ ప్రసాద్.. చిట్టిబాబుగా నూకరాజు.. మహేష్ కారెక్టర్‌ను ఇమాన్యుయేల్.. సమంతగా శ్రీముఖి నటించింది. సర్పంచ్‌గా జగపతి బాబుకు ఓ స్లాంగ్ ఉంటుంది.. అలా మాట్లాడేందుకు పంచ్ ప్రసాద్ మాట్లాడతాడు. కానీ వాయిస్ సరిగ్గా రాకపోవడంతో కౌంటర్లు వేస్తారు. వీడికే కదా? చెవులు పోయాయ్ అని ఇమాన్యుయేల్ మీద కౌంటర్లు వేస్తాడు పంచ్ ప్రసాద్. వీడికే కదా? రెండు కిడ్నీలు పోయాయ్ అని పంచ్ ప్రసాద్ మీద కౌంటర్లు వేస్తాడు ఇమాన్యుయేల్. అలా ప్రతీ ఒక్కరూ పంచ్ ప్రసాద్ మీద కౌంటర్లు వేస్తూ వాడేస్తున్నారు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.