Puri Jagannadh : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత తీసిన చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందింది.ఆగస్టుల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని హన్మకొండలో లైగర్ టీం ఫ్యాన్డమ్ టూర్‌ని నిర్వహించింది ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారికి కృతజ్ఞతలు అంటూ తన స్పీచ్ లో జోరు పెంచిన పూరీ.. ఒక రోజు మా ఆవిడ తిట్టింది అని చెప్పాడు. ఎందుకంటే.. కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు మంచి మంచి సినిమాలు తీసుతున్నారు.. నువ్వు వెనకపడిపోతున్నావ్ అని.
సందీప్ రెడ్డి వంగా అనే డైరెక్టర్ వచ్చాడు. అర్జున్ రెడ్డి అనే సినిమా తీశాడు. నేను నా కూతురు మూడు సార్లు చూశాం., నువ్వూ చూడు” అని చెప్పింది. అర్జున్ రెడ్డి చూశా. డైరెక్షన్ బావుంది.. సినిమా కూడా బాగానే వెళ్తుంది. కానీ 45 నిమిషాలు సినిమా చూసి ఆపేశా. కారణం.. సినిమాలో కుర్రాడిపై నా ద్రుష్టి ఆగిపోయింది. ఇంత నిజాయితీగా ఒక కుర్రాడు నటిస్తున్నాడని విజయ్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అప్పుడే విజయ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. విజయ్ నాన్నగారు మా అబ్బాయిని ఒక కొడుకులా చూసుకొని మంచి సినిమా తీయ్ అన్నారు.
కానీ విజయ్ నన్ను ఒక తండ్రిలా చూసుకొని నా కష్టాల్లో నాతో పాటు నిల్చున్నాడు. విజయ్ లాంటి హీరోని నేను చూడలేదు. మైక్ టైసన్ ని పట్టుకోవడానికి ఏడాది పట్టింది. ఆయన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చిన క్రెడిట్ ఛార్మికి దక్కుతుంది. మైక్ టైసన్ లాంటి లెజెండ్ తో కలసి పని చేసే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఛార్మీ సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఏ కష్టాన్ని నా వరకూ తీసుకురానివ్వదు. సెట్ లో ఆమె ఏడ్చిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ బయటికి చెప్పదు. ఛార్మీకి బిగ్ థ్యాంక్స్ అండ్ లవ్ యూ అంటూ పూరీ తన స్పీచ్‌ని చాలా ఎమోషనల్‌గానే ఇచ్చాడు. ప్రస్తుతం పూరీ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.