Puri Jagannadh : అంద‌రి ముందే భార్య తిట్టింద‌ని చెబుతూ ఛార్మీకి ఐ ల‌వ్ యూ చెప్పిన పూరీ

Authored By Sam C | The Telugu News | Published on: August 15, 2022, 5:40 pm

Puri Jagannadh : డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌.. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత తీసిన చిత్రం లైగ‌ర్. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ చిత్రం రూపొందింది.ఆగస్టుల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని హన్మకొండలో లైగర్‌ టీం ఫ్యాన్డమ్ టూర్‌ని నిర్వహించింది ఈ సందర్భంగా డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారికి కృతజ్ఞతలు అంటూ త‌న స్పీచ్ లో జోరు పెంచిన పూరీ.. ఒక రోజు మా ఆవిడ తిట్టింది అని చెప్పాడు. ఎందుకంటే.. కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు మంచి మంచి సినిమాలు తీసుతున్నారు.. నువ్వు వెనకపడిపోతున్నావ్ అని.

Puri Jagannadh : పూరీ షాకింగ్ కామెంట్స్

సందీప్ రెడ్డి వంగా అనే డైరెక్టర్ వచ్చాడు. అర్జున్ రెడ్డి అనే సినిమా తీశాడు. నేను నా కూతురు మూడు సార్లు చూశాం., నువ్వూ చూడు” అని చెప్పింది. అర్జున్ రెడ్డి చూశా. డైరెక్షన్ బావుంది.. సినిమా కూడా బాగానే వెళ్తుంది. కానీ 45 నిమిషాలు సినిమా చూసి ఆపేశా. కారణం.. సినిమాలో కుర్రాడిపై నా ద్రుష్టి ఆగిపోయింది. ఇంత నిజాయితీగా ఒక కుర్రాడు నటిస్తున్నాడని విజయ్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అప్పుడే విజయ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. విజయ్ నాన్నగారు మా అబ్బాయిని ఒక కొడుకులా చూసుకొని మంచి సినిమా తీయ్ అన్నారు.

Puri Jagannadh Asked Charmi Kaur To Give KS

Puri Jagannadh Asked Charmi Kaur To Give KS

కానీ విజయ్ నన్ను ఒక తండ్రిలా చూసుకొని నా కష్టాల్లో నాతో పాటు నిల్చున్నాడు. విజయ్ లాంటి హీరోని నేను చూడలేదు. మైక్ టైసన్ ని పట్టుకోవడానికి ఏడాది పట్టింది. ఆయన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చిన క్రెడిట్ ఛార్మికి దక్కుతుంది. మైక్ టైసన్ లాంటి లెజెండ్ తో కలసి పని చేసే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఛార్మీ సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఏ కష్టాన్ని నా వరకూ తీసుకురానివ్వదు. సెట్ లో ఆమె ఏడ్చిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ బయటికి చెప్పదు. ఛార్మీకి బిగ్ థ్యాంక్స్ అండ్ ల‌వ్ యూ అంటూ పూరీ త‌న స్పీచ్‌ని చాలా ఎమోష‌న‌ల్‌గానే ఇచ్చాడు. ప్ర‌స్తుతం పూరీ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

Sam C

No bio available for this author.

  1. "WhatsApp Web : వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. ఈ చిన్న తప్పుతో మీ అకౌంట్ ప్రమాదంలో పడొచ్చు!"

  2. "Trisha Politics : మరో జయలలితగా త్రిష?.. విజయ్‌తో రాజకీయాల్లోకి వస్తారా? అభిమానుల కొత్త ప్లాన్!"

  3. "Farmers Income : పంటల కంటే కూలీ పనులతోనే ఎక్కువ ఆదాయం.. రైతులపై NSO సర్వేలో సంచలన విషయాలు!"

  4. "Indiramma Bima : రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా కోసం ఈ పత్రాలు చాలు.. డిసెంబర్ 18 వరకే చాన్స్‌..!"

  5. "Gold Rate Today : 24 నవంబర్ 2026 మళ్లీ షాకిస్తున్న బంగారం.. వరుసగా రెండో రోజూ పెరిగిన పసిడి ధరలు..!"

  6. "Bigg Boss Telugu 10 : రష్మిక మందన్నాకు కాలేజీ సీనియర్ ఈ కంటెస్టెంటా?.. నేషనల్ క్రష్‌కు ఊహించని సర్‌ప్రైజ్!"

  7. "School Holiday : నవంబర్ 24న స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ప్రభుత్వం కీలక ప్రకటన..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp