Home » Entertainment » Puri Jagannadh Fans Unhappy With Charmy Kaur Involvement In Movies
Entertainment

Puri Jagannadh : పూరి సర్‌ ప్లీజ్ ఛార్మీని పక్కన పెట్టండి.. ఓ అభిమాని రిక్వెస్ట్‌

Authored By
aruna
The Telugu News | Published on: August 30, 2022, 2:20 pm
Advertisement

Puri Jagannadh : టాలీవుడ్ లో ఏ మాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఈయన కెరియర్ ఆరంభంలోనే అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. రాజమౌళి మరియు సుకుమార్ వంటి ప్రముఖ దర్శకులకు కూడా ఈయనను అభిమాన దర్శకుడు అంటూ చెబుతారు. అందుకు కారణం కేవలం రెండు మూడు నెలల్లోనే అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాగల సమర్థుడు. ఒక సినిమాను ఇతర దర్శకులు చేసే సమయంలో కొండను నెత్తిన పెట్టినంత భారంగా భావిస్తారు. కానీ దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం సునాయాసంగా తన సినిమాలను తీసేస్తాడు. తన సినిమాలోని హీరోల యొక్క పాత్రలకు డైలాగ్స్ అప్పటికప్పుడు రాసి వావ్ అనిపిస్తాడు.

Advertisement

అలాంటి దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు గతమెంతో గణం అన్నట్లుగా మారిపోయాడు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. మధ్యలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కాస్త పర్వాలేదు అనిపించినా తాజాగా వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ సినిమా దారుణమైన పరాజయాన్ని చూసింది. ఈ సమయంలోనే విజయ్ దేవరకొండ అభిమానులు మరియు దర్శకుడు పూరి జగన్నాథ్‌ అభిమానులు సోషల్ మీడియాలో చార్మిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. చార్మి గత కొన్నాళ్లుగా పూరి జగన్నాథ్ యొక్క నిర్మాణ సంస్థ పనులను చక్కబెడుతున్న విషయం తెలిసిందే. ఆమె సినిమా యొక్క నిర్మాణ వ్యవహారాలను చూడడంతో పాటు ప్రొడక్షన్ కంట్రోల్ నుండి నటీనటుల ఎంపిక వరకు అన్ని విషయాల్లో కూడా నిర్ణయాలను తీసుకుంటూ ఉంది.

Puri Jagannadh fans unhappy with Charmy Kaur Involvement in movies

Advertisement

ఆమె కేవలం సినిమాల యొక్క ప్రొడక్షన్ పనులు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు దర్శకత్వం పనులు కూడా చక్కబెట్టింది అంటూ కొందరు పుకార్లు షికార్లు చేస్తున్నారు. అందుకే దర్శకుడు పూరి జగన్నాథ్ కి.. ఆయన అభిమానులు దయ చేసి చార్మిని పక్కకు ఉంచండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆమె వల్లే సినిమాలు ఇలా అవుతున్నాయి, ఆమె పక్కన ఉండడం వల్ల మీ కెరియర్ కి నష్టం తప్పదు అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే సినిమాల వరకు చార్మిని పక్కన పెడితే బాగుంటుంది అంటూ కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి పూరి జగన్నాథ్ తదుపరి సినిమా కైనా చార్మిని పక్కకు పెడతాడా అనేది చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి