Allu Arjun : డేవిడ్ వార్నర్‌కి ఆ స్టెప్ నేర్పిస్తానన్న అల్లు అర్జున్.. మనోడి రియాక్షన్ ఏంటో..!
Allu Arjun : అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా సాధించిన విజయంతో ఇప్పుడు పుష్ప2పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్స్ రాగా నిన్న ఫస్ట్ సాంగ్ పుష్ప టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప పుష్ప.. అంటూ సాగే ఈ పాట, అందులో అల్లు అర్జున్ అదిరే స్టెప్పులు.. అందరికి తెగ నచ్చేసాయి. ఇప్పుడు పుష్ప2 సాంగ్ విదేశాల్లో కూడా ట్రెండ్ అవుతుంది. తాజాగా పుష్ప సాంగ్ రిలీజయిన 24 గంటల్లో యూట్యూబ్ లో సాధించిన రికార్డులని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అన్ని భాషల్లో కలిపి ఈ పాట 24 గంటల్లో ఏకంగా 40 మిలియన్ వ్యూస్ సాధించింది.
అంతే కాక 1.27 మిలియన్ లైక్స్ సాధించింది. ఇక ప్రస్తుతం 15 దేశాల్లో పుష్ప సాంగ్ ట్రెండ్ అవుతుంది.. పుష్ప మొదటి సాంగ్ తోనే వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుండటంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఈ పాటలోని కొన్ని స్టెప్పులు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక కొంత ట్రాక్‌వీడియోను అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ ల్‌లో పంచుకున్నాడు. ” పుష్ప పుష్ప పాటలో ఈ షూ డ్రాప్ స్టెప్ చేయడాన్ని ఎంతో ఆనందించాను” అంటూ కామెంట్‌గా రాసాడు.. #Pushpa2TheRule, #Pushpa2FirstSingle అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఈ పోస్ట్‌కి జోడించాడు. దీన్ని చూసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘ఓ డియర్ ఇది ఎంతో బాగుంది. ఇప్పుడు నాకు కొంత పని పడింది.’ అంటూ కామెంట్ చేశాడు.
Allu Arjun : డేవిడ్ వార్నర్‌కి ఆ స్టెప్ నేర్పిస్తానన్న అల్లు అర్జున్.. మనోడి రియాక్షన్ ఏంటో..!
డేవిడ్ వార్నర్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. “ఇది చాలా సులభం. మనం కలిసినప్పుడు నేను మీకు చూపిస్తాను” అంటూ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు.దీనికి వార్నర్ ఎలాంటి రిప్లై ఇస్తాడో చూడాలి.ఇక బన్నీ సినిమాలకి సంబంధించిన పాటలు, డైలాగ్‌లకు రీల్స్ చేశాడు డేవిడ్ వార్నర్. పుష్ప సినిమాలో పలు డైలాగ్‌లతో పాటు శ్రీవల్లి పాటకు వార్నర్ డ్యాన్స్ చేసి అలరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప 2లోని షూ డ్రాప్ స్టెప్ చేయాలని వార్నర్ ఫిక్సైయ్యాడు. అందుకనే తన కామెంట్‌లో కొంత పని పడిందని చెప్పగా.. అదేమీ పెద్ద కష్టమైన స్టెప్ కాదని కలిసి నప్పుడు నేర్పిస్తానని అంటూ అల్లు అర్జున్ అన్నాడు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.