pushpa 2 movie latest update
Pushpa 2 Movie : స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ని ఐకాన్‌స్టార్‌గా మార్చిన చిత్రం పుష్ప. `పుష్ప` మొదటి భాగం గతేడాది డిసెంబర్ 17న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవల ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్బంగా `అవతార్2` ప్రదర్శించే థియేటర్లలో `పుష్ప2` వీడియో గ్లింప్స్ ని ప్రదర్శించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఎర్రచందనం స్మిగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా బన్నీ నటించారు. శ్రీవల్లిగా బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటించగా, నెగటివ్ రోల్‌లో ఫహద్ ఫాజిల్ నటించారు. మూవీకి దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
అయితే రెండో పార్ట్ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండగా, మొదటి భాగంలోని ఆర్టిస్టులు కొనసాగడంతోపాటు కొత్త ఆర్టిస్టులు కూడా రెండో భాగంలో జాయిన్ అవుతారట. మరోవైపు మొదటి సినిమాలో సమంతతో `ఊ అంటావా మావ.. `అనే ఐటెమ్ సాంగ్ పెట్టగా, అది సంచలనం సృష్టించింది. రెండో భాగంలోనూ అలాంటి ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుందని, బాలీవుడ్ భామతో చేయించాలనుకుంటున్న ట్టు ప్రచారం నడుస్తుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.
pushpa 2 movie latest update
ఇక పుష్ప 2 చిత్ర బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప 2 సినిమాకు బడ్జెట్ 400 – 500 కోట్ల మధ్యలో అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పుష్ప బాలీవుడ్‌లో అంచనాలు లేకుండానే రు. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో ఈ సినిమాకి ఏ మాత్రం వెనకాడకుండా డబ్బులు ఖర్చు చేయనున్నట్టు టాక్.బన్నీకి పారితోషికం, లాభాలతో కలిపి ఏకంగా 130 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప2 బడ్జెట్ విషయంలో మైత్రీ నిర్మాతలు ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తుండగా, ఏదైన తేడా వస్తే మాత్రం కొంప కొల్లేరు కావడం ఖాయమని అంటున్నారు.
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
This website uses cookies.