Pushpa 2 The Rule : అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌సై నవీన్ ఎర్నేని, రవి యలమంచలి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినాను చాటి చెప్పింది. దాంతో ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప ది రూల్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోవిడ్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా పుష్ప చిత్రం నిలిచింది. ఈ సినిమా సుమారుగా 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాబిజినెస్ సుమారుగా 150 కోట్ల రూపాయల మేర జరగగా, చిత్రాన్ని ఇండియాలోనే సుమారుగా 300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఈ సారి పుష్ప2 చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాని ఆల్రెడీ పలు పలు వాయిదాలు తర్వాత డిసెంబర్ 6కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ డేట్ లో కూడా కాదు కొంచెం ముందే సినిమా వస్తుంది అని పలు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మేకర్స్ ఆ బిగ్ అనౌన్సమెంట్ ని అఫీషియల్ గా ఇచ్చేసారు. నేడు జరిపిన నేషనల్ ప్రెస్ మీట్ లో పుష్ప 2 సినిమాని ఈ డిసెంబర్ 6న కాకుండా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక అదిరే పోస్టర్ తో తెలిపారు. మరి ఇందులో బన్నీ సాలిడ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. మొత్తానికి అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ టేకోవర్ డిసెంబర్ 5 నుంచి ఉంటుంది అని చెప్పాలి.
డిసెంబర్ 4న ఓవర్సీస్‌లో వస్తుందని అన్నారు. ఇక్కడ మాత్రం డిసెంబర్ 5న ఇండియాలో రిలీజ్ అవుతుందని, లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు.ఇక ఈ మూవీ షూటింగ్ కాస్త బ్యాలెన్స్ ఉందని, ఐటం సాంగ్ కోసం ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఏ హీరోయిన్ అన్నది ఇంకా కన్ఫామ్ కాలేదని అన్నారు. ఇంకో రెండు, మూడు రోజుల్లో హీరోయిన్‌ను కన్ఫామ్ చేస్తామని తెలిపారు. నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా షూటింగ్ పూర్తి అవుతుందని చెప్పుకొచ్చారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీలో రష్మిక కథానాయిక నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.