Ind Vs Nz 2nd Test : వాష్టింగ్టన్ దెబ్బకు విలవిలలాడిన న్యూజిలాండ్ .. భారత టెస్టు చరిత్రలో తొలిసారి..!
Ind Vs Nz 2nd Test : తొలి టెస్ట్‌లో దారుణంగా ఓడిన టీమిండియా రెండో టెస్ట్‌లో పట్టు బిగించింది Ind Vs Nz 2nd Test . టాస్ గెలిచి న్యూజిలాండ్ New Zealand బ్యాటింగ్ ఎంచుకోగా, మొదట్లో ఆటపై బాగానే పట్టు బిగించారు. మూడేళ్ల తర్వాత భారత్ India Test Match టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సుందర్ washington sundar ఈరోజు తొలి ఇన్నింగ్స్‌లో 23.1 ఓవర్లు వేసి కేవలం 59 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఇద్దరు బౌలర్ల దెబ్బకే న్యూజిలాండ్ టీమ్ మొత్తం 79.1 ఓవర్లలో 259 పరుగులకి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. తొలి టెస్ట్ పరాజయం అనంతరం వాషింగ్టన్ సుందర్‌ను సెలెక్టర్లు.. భారత జట్టుకు ఎంపిక చేయగా కొందరు పెదవి విరిచారు. కాని వారందరికి తన స్పిన్ మాయాజాలంతో సమాధానం ఇచ్చారు
తన సహచర తమిళ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(3/64) తో కలిసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు సుందర్ . ఈ క్రమంలో 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్పిన్నర్లు 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. హాఫ్ సెంచరీతో నిలకడగా ఆడుతున్న రచిన్ రవీంద్రను సుందర్ ఔట్ చేసిన విధానం ఈ మ్యాచ్‌కే హైలైట్. ఈ వికెటే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పతనాన్ని శాసించింది.వాషింగ్టన్ సుందర్ దెబ్బకి వరుసగా రచిన్ రవీంద్ర, డార్లీ మిచెల్ (18), టామ్ బ్లండెల్ (3), గ్లెన్ ఫిలిప్స్ (9), మిచెల్ శాంట్నర్ (33), టిమ్ సౌథీ (5), అజాజ్ పటేల్ (4) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. విలియమ్ ఓరోర్కీ (0 నాటౌట్) అజేయంగా క్రీజులో నిలిచాడు.
Ind Vs Nz 2nd Test : వాష్టింగ్టన్ దెబ్బకు విలవిలలాడిన న్యూజిలాండ్ .. భారత టెస్టు చరిత్రలో తొలిసారి..!
ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టి మరీ వాషింగ్టన్ సుందర్‌కి రోహిత్ శర్మ ఛాన్స్ ఇవ్వగా.. అవకాశాన్ని రెండుజేతులా ఈ భారత స్పిన్నర్ వినియోగించుకొని తన ఎంపిక సరైనదేనని నిరూపించారు. సుందర్ తీసిన ఏడు వికెట్లలోనే ఐదు క్లీన్ బౌల్డ్ ద్వారానే లభించడం విశేషం.ఇక భారత్ కూడా తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టగా, రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. సౌథీ బౌలింగ్‌లో పెవీలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్(6), గిల్(10) ఉన్నారు. 11 ఓవర్లకి గాను భారత్ వికెట్ నష్టానికి 156పరుగులు చేసింది. ఈ క్రమంలో భారత్ 243 పరుగులు వెనకంజలో ఉంది. రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్స్ ఎన్ని పరుగులు రాబడతారో చూడాలి.
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
This website uses cookies.