Home » Entertainment » Pushpa Movie Making 2 Crores Budget Only Teaser
Entertainment

Pushpa 2 Movie Teaser : టీజర్ కి రెండు కోట్లు .. పుష్ప 2 కోసం సుకుమార్ పిచ్చెక్కిపోయే బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు – మొత్తం చదవండి..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 1, 2023 6:08 pm
Advertisement

Pushpa 2 Movie Teaser : గతేడాది విడుదలైన ‘ పుష్ప ‘ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి గుర్తింపును పొందింది. దీంతో త్వరలోనే ఈ సినిమా రెండో భాగాన్ని విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నారు. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో సినిమా యూనిట్ సభ్యులు కాస్త ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారు. కేవలం మేకింగ్ కోసం దాదాపు 400 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం

Advertisement

Pushpa movie making 2 crores budget only teaser

త్వరలోనే పుష్ప 2 సినిమా టీజర్ విడుదల కాబోతుంది. టీజర్ కోసం ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం, విజువల్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ చేస్తున్నారట. అందుకోసం రెండు నుండి మూడు కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని సమాచారం. దీంతో జనాలు టీజర్ కు అన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా యొక్క స్థాయిని అమాంతం పెంచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ భాషలలో మరియు హిందీలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

వచ్చే సంవత్సరం ఈ సినిమా విడుదల కాబోతోంది. టీజర్ విడుదల సమయంలో ఈ సినిమా రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించింది. రెండో భాగంలో కూడా రష్మిక మందన నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే పుష్ప 2 టీజర్ రాబోతుంది. దీంతో పుష్ప 2 టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్ధాయిలో గుర్తింపు పొందాడు. ఇక పుష్ప టు తో అల్లు అర్జున్ క్రేజ్ ఇంకా పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి