Home » Entertainment » Pushpa Srivalli Full Video Song
Entertainment

Pushpa : శ్రీవ‌ల్లి వీడియో సాంగ్ విడుద‌ల‌.. మైమ‌ర‌చిపోతున్న ఫ్యాన్స్

Authored By
Sam C
The Telugu News | Published on: January 4, 2022, 6:35 pm
Advertisement

Pushpa : ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్ర తొలి పార్ట్ డిసెంబ‌ర్ 17న విడుద‌లై పెద్ద విజ‌యం సాధించింది. ఈ సినిమా నుండి వ‌చ్చిన ప్ర‌తి అప్‌డేట్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం మైమ‌ర‌చిపోయేలా చేసింది. ఇందులో శ్రీ వ‌ల్లి అనే సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా చిత్రం నుండి శ్రీ వ‌ల్లి అనే వీడియో సాంగ్ విడుద‌ల చేశారు.

Advertisement

‘చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే.. ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయెనే ఏ ఏ’.. అంటే సాగే ఈ పాట‌ను ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినేట్టుగా ఉంటుంది . కొద్ది సేపటి క్రితం విడుదలైన శ్రీవల్లి ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌‌ని షేక్ చేస్తుంది. దేవి శ్రీ ఈజ్ బ్యాక్ అనేట్టుగానే అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు రాక్ స్టార్. ఈ ట్యూన్‌కి దగ్గట్టుగానే చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను స్వర సంచలనం సిద్ శ్రీరామ్ ఆలపించారు.

Pushpa Srivalli Full Video Song

Advertisement

Pushpa : విజువ‌ల్‌గా అదిరిపోయిన శ్రీ వ‌ల్లి సాంగ్ :

డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌పై అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారథ్యం వహించిన ఈ ఆల్బమ్‌లోని అన్నీ పాటలు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ సాధించాయి. హిందీలోనూ ‘పుష్ప’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫిబ్ర‌వ‌రి రెండో పార్ట్ షూటింగ్ జ‌ర‌గ‌నుండ‌గా,ఇది తొలి పార్ట్‌ని మించేలా ఉంటుంద‌ని అంటున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి