Race Gurram Villain Ravi Kishan : ఆ హీరోయిన్ నన్ను రాత్రి ఇంటికి రమ్మన్నది.. అల్లు అర్జున్ విలన్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Race Gurram Villain Ravi Kishan : కాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసు. అందుకే కాస్టింగ్ కౌచ్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు. కాస్టింగ్ కౌచ్ విషయంలో తమకు ఎదురయ్యే అనుభవాలను ఎప్పుడో ఒకప్పుడు తమ అభిమానులతో పంచుకుంటారు. చాలామంది హీరోయిన్లు.. అవకాశాల పేరుతో ఇండస్ట్రీలో ఎంత దారుణంగా మోసపోయారో మనం చూశాం. కొందరు వెంటనే ఓపెన్ అప్ అయి తమపై జరిగే దారుణాలను బయటపెడుతున్నారు. సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే.. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మహిళలకే పరిమితం కాదు. హీరోలు, ఒక్కోసారి విలన్స్ కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Race Gurram Villain Ravi Kishan comments about casting couch
Race Gurram Villain Ravi Kishan comments about casting couch

అది కూడా స్టార్ హీరోయిన్ల నుంచి వేధింపులు వస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఒక స్టార్ హీరో, స్టార్ విలన్ ఆ బాధను పడాల్సి వచ్చిందట. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో అంటారా? రేసు గుర్రం విలన్ రవి కిషన్ సింగ్. ఆయన భోజ్ పురి భాషల్లో పెద్ద హీరో. కానీ.. తెలుగులో విలన్ గా చాలా సినిమాల్లో నటించారు. రవి కిషన్ విలన్ గా నటించిన రేసుగుర్రం, కిక్ 2 సినిమాలు తెలుసు కదా. ఆ సినిమాలతోనే ఆయన ఫేమస్ అయ్యారు. స్టార్ విలన్ అనిపించుకున్నారు. మరోవైపు ఆయన ఎంపీ కూడా. యూపీ నుంచి ఎంపీ అయ్యారు. ఆయన తాజాగా ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. చాలామంది అబ్బాయిలు కూడా కాస్టింగ్ కౌచ్ కు బలవుతున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement

Race Gurram Movie Scenes | Ravi Kishan threatens leaders for party ticket |  Allu Arjun - YouTube

Race Gurram Villain Ravi Kishan : రేసుగుర్రం, కిక్ 2 లో విలన్ గా రాణించిన రవి కిషన్

తాను కూడా ఇండస్ట్రీలో అటువంటి సమస్యను ఎదుర్కొన్నాని చెప్పుకొచ్చారు. తను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఒక స్టార్ హీరోయిన్.. రవి కిషన్ ను రాత్రికి ఇంటికి రావాలంటూ ఆహ్వానించిందట. రాత్రి పూట కాఫీ తాగడం కోసం ఆహ్వానించడం ఏంటి అని రవి కిషన్ ఆశ్చర్యపోయారట. అయితే.. ఆమె ప్రవర్తన తెలిశాక ఆమె ఎందుకు పిలిచిందో రవి కిషన్ కు అర్థం అయిందట. దీంతో వెంటనే తాను రానని నో చెప్పారట. ఇప్పుడు ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. కానీ.. ఆమె ఎవరు.. ఆ పేరు మాత్రం చెప్పలేదు రవి కిషన్. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Advertisement