Radhe Shyam : ప్రభాస్ హిట్ కొట్టలేకపోయాడా..? యావ‌రేజ్ టాక్ పాజిటివ్‌గా మారుతుందా?

Authored By mallesh | The Telugu News | Published on: March 11, 2022, 7:30 pm

Radhe Shyam : ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానే వ‌చ్చింది. భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైంది. ప్ర‌భాస్, పూజా హెగ్డే న‌టించిన ఈ మూవీపై ప్ర‌పంచ వ్యాప్తంగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. బాహుబ‌లి, సాహో చిత్రాల త‌ర్వాత వ‌స్తున్న ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ రాధాకృష్ణా కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ, జగపతిబాబు, సత్యరాజ్ లాంటి సీనియర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు.అయితే ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు రాగా ప్రేక్షకుల నుంచి మాత్రం మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. క్లాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కాగా ఈ మూవీకి మిక్డ్స్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడుతున్నారు. అయితే గతేడాది డిసెంబర్ లో విడుదలైన అఖండ, పుష్ప ది రైజ్ సినిమాలకు కూడా మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ కు నచ్చడంతో పాటు మెజారిటీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఫస్ట్ వీకెండ్ వరకు రాధేశ్యామ్ కలెక్షన్లకు ఢోకా లేకపోయినా వీకెండ్ తర్వాత కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫలితంపై ఒక అంచనాకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.రాధేశ్యామ్ తో అయినా రాధాకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ ఆశించగా ప్రేక్షకులను నిరాశపరిచారు. కథ బాగానే ఉన్నా కథనంలోని లోపాలు రాధేశ్యామ్ సినిమాకు మైనస్ అయ్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు.

Radhe Shyam Movie in prabhas gets success

Radhe Shyam Movie in prabhas gets success

Radhe Shyam : హిట్ ట్రాక్ లోకి వ‌స్తుందా..?

కాగా దాదాపు నాలుగేళ్లు ప్రభాస్ ఈ సినిమా కోసం కేటాయించాడు. అయితే ఈ మూవీలో గ్రాండ్ విజువల్స్ ఉన్నా, ప్రభా, పూజా హెగ్డేలు అద్భుతంగా పర్ఫార్మ్ చేసినా సక్సెస్ అనే టాక్ రావడం లేదు. క్లాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధార‌ణంగా పూర్తి స్థాయి ల‌వ్ స్టోరీల‌కు స్లో న‌రేష‌న్ అని అద‌ని.. ఇద‌ని టాక్ వ‌స్తుంది ఓ వారం త‌ర్వాత హిట్ ట్రాక్‌లోకి వ‌స్తుంది. రాధేశ్యామ్ మూవీకి కూడా ఇలాంటి హిట్ టాక్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. రాధేశ్యామ్ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

mallesh

No bio available for this author.

  1. "AP Government : ఏపీ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్.. కుటుంబ పెద్ద మరణిస్తే నేరుగా ఖాతాలోకి రూ.20 వేలు.. అప్లై ఎలాగంటే..?"

  2. "Vemuri Radhakrishna : అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్.. సీఎంలను సైతం తన దగ్గరికి రప్పించుకునే వేమూరి రాధాకృష్ణ మంత్రదండం ఏంటి..?"

  3. "Kushaiguda : కుషాయిగూడ బస్‌స్టాప్ సమస్యకు పరిష్కారం.. పరమేశ్వర్ రెడ్డికి ప్రజల కృతజ్ఞతలు"

  4. "Actor Giribabu : బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత!"

  5. "PM CARES for Children : గుడ్‌న్యూస్.. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేంద్రం భారీ భరోసా.. చేతికి రూ.10 లక్షలు, చదువంతా ఫ్రీ..!"

  6. "Six Ducks ODI Cricket : చ‌రిత్ర‌లో మ‌ర్చిపోలేని రోజు.. ఒకే రోజు 6 డకౌట్లు, అందులో 3 గోల్డెన్ డకౌట్లు…!"

  7. "Bigg Boss Telugu 10 : డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరూ.. పదో వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp