Radhe Shyam : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజైంది. ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత వస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ రాధాకృష్ణా కుమార్ దర్శకత్వం వహించారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ, జగపతిబాబు, సత్యరాజ్ లాంటి సీనియర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు.అయితే ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు రాగా ప్రేక్షకుల నుంచి మాత్రం మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. క్లాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాగా ఈ మూవీకి మిక్డ్స్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడుతున్నారు. అయితే గతేడాది డిసెంబర్ లో విడుదలైన అఖండ, పుష్ప ది రైజ్ సినిమాలకు కూడా మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ కు నచ్చడంతో పాటు మెజారిటీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఫస్ట్ వీకెండ్ వరకు రాధేశ్యామ్ కలెక్షన్లకు ఢోకా లేకపోయినా వీకెండ్ తర్వాత కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫలితంపై ఒక అంచనాకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.రాధేశ్యామ్ తో అయినా రాధాకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ ఆశించగా ప్రేక్షకులను నిరాశపరిచారు. కథ బాగానే ఉన్నా కథనంలోని లోపాలు రాధేశ్యామ్ సినిమాకు మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు.
కాగా దాదాపు నాలుగేళ్లు ప్రభాస్ ఈ సినిమా కోసం కేటాయించాడు. అయితే ఈ మూవీలో గ్రాండ్ విజువల్స్ ఉన్నా, ప్రభా, పూజా హెగ్డేలు అద్భుతంగా పర్ఫార్మ్ చేసినా సక్సెస్ అనే టాక్ రావడం లేదు. క్లాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా పూర్తి స్థాయి లవ్ స్టోరీలకు స్లో నరేషన్ అని అదని.. ఇదని టాక్ వస్తుంది ఓ వారం తర్వాత హిట్ ట్రాక్‌లోకి వస్తుంది. రాధేశ్యామ్ మూవీకి కూడా ఇలాంటి హిట్ టాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. రాధేశ్యామ్ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.